Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

- Advertisement -

జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుందో లేదో చంద్రబాబు దాన్ని ఓర్వలేకపోతున్నారు.. జగన్ వచ్చిన దగ్గరినుంచి ఎప్పుడెప్పుడు జగన్ ను పీఠం మీదనుంచి దింపుదామా అని ఎదురుచూస్తూ విమర్శలు చేస్తూ ప్రజల తరపున పోరాడే పుణ్యకాలాన్ని పోగొట్టుకుంటున్నారు.. అమరావతి విషయంలో తప్పా చంద్రబాబు ప్రజల తరపున పోరాడిన అంశం ఏమీ లేదు.. అది కూడా చంద్రబాబు ప్రయోజనాలకోసం చేస్తున్నాడని అందరికి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా చంద్రబాబు జమిలి ఎన్నికలు వస్తాయని గట్టి నమ్మకం తో ఉన్నాడు.. అయితే చంద్రబాబు పడే పడే ఇలా అనడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది..

పార్టీ మీటింగ్ పెట్టినప్పుడలా మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరుస్తున్నారు.. అయితే ఇది పార్టీ ని నేతలని హుషారుగా ఉంచడానికి అని మొదట్లో వైసీపీ వారు భావించారు కానీ పదే పదే చంద్రబాబు ఇదే పదం వాడడంతో చంద్రబాబు జమిలి ఎన్నికలపై ఎందుకింత ఇంట్రెస్ట్ గా ఉన్నారో అర్థం కావట్లేదు అనిపిస్తుంది. ఆన్ లైన్ ద్వారా.. పార్లమెంటరరీ నినియోజవర్గ స్థాయి నేతలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన అందరికీ ఒకటే చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయని.. అందరూ సిద్దంగా ఉండాలనే చెబుతున్నారు. చంద్రబాబుకు ఏదో సమాచారం ఉండబట్టే… ఈ విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.

నిజానికి గత ఎన్నికలు ముగిసిన తర్వాత 2022 లోనే జమిలి ఎన్నికలు వస్తాయని ప్రచారం జరిగింది. దానికి సంబందించిన కసరత్తులు కూడా ప్రధాన మంత్రి స్థాయిలో జరిగాయి.. . ఆ తరవాత అది అంతర్గతంగా జరుగుతూనే ఉందని చెబుతున్నారు. కోవిడ్ కారణంగా ఆ ప్లాన్లకు పులిస్టాప్ పడవచ్చని భావించారు. కానీ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ పరంగా.. బీజేపీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు మళ్లీ జమిలీ ఎన్నికల వ్యూహాల దిశగా వెళ్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించేలా చేశాయి. అయితే గతంలో జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకత చూపుతామని టీడీపీ లిఖిత పూర్వకంగా రాసిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జమిలి నిర్వహించడానికి ముందుకు వస్తుండడం వెనుక అనుమానాలకు దారితీస్తుంది. మరి జగన్ ని దించడానికి ఏయే శక్తులు ఏవిధంగా పనిచేస్తున్నాయో..

చంద్రబాబు డ్రామాలకు హద్దులు లేవా.?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

జగన్.. మోడీ తో చర్చకు వచ్చే అంశాలివే.?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -