Wednesday, May 8, 2024
- Advertisement -

పచ్చ మీడియా హెడ్స్‌తో పచ్చ పార్టీ అధినేత సీక్రెట్ మీటింగ్…. అక్షింతల వర్షమే

- Advertisement -

తెలంగాణాలో ఘోర ఓటమి పచ్చ పార్టీ ప్రముఖుల్లో గొడవలు రేపుతోందా? రిటన్ గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్, 2019లో మోడీ అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్లేషణలు……వస్తే పచ్చ పార్టీ ప్రముఖుల పని పట్టడం ఖాయం అన్న విశ్లేషణల నేపథ్యంలో ప్రస్తుతం పచ్చ పార్టీ ముఖ్యనేతతో పాటు, సదా ఆ పెదబాబు, చినబాబుల భజన చేస్తూ ఉండే పచ్చ మీడియా అధినేతల్లోనూ భయం మొదలైంది. అలాగే పచ్చ పార్టీకి ఎల్లప్పుడూ తోడుగా ఉండే కుల వ్యాపారవేత్తలందరిలోనూ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న దడ మొదలైంది.

అందుకే అందరి మధ్యా ఒక సీక్రెట్ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఆ మీటింగ్‌లోనే తోకపార్టీ అధినేత పార్టీ ముఖ్యనేత, పెదబాబుపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి ఆగ్రహం వ్యక్తం చేశాడట. తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తు వద్దు, కేసీఆర్ 80సీట్లతో గెలవడం ఖాయం అని చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి ఇప్పుడు కేసీఆర్‌తో తలగోక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడట. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఓడినప్పటికీ కాంగ్రెస్‌తో పోటాపోటీగా సీట్లు గెలవడం, తెలంగాణాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంలాంటి విషయాలపై మీటింగ్‌లో హాట్ హాట్ చర్చ జరిగిందని తెలుస్తోంది. 2019 లో కూడా మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాక తప్పని పరిస్థితిలో ఉన్నామని, తేడా వస్తే భవిష్యత్ భయానకంగా ఉంటుందన్న ఆందోళనను ముఖ్యనేతనే వెలిబుచ్చాడట.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని అయితే అన్ని పార్టీల నుంచీ సెకండరీ గ్రేడ్ నాయకులను కొనెయ్యడం, ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టే వ్యూహం, పచ్చ మీడియా ప్రచారంతో ముఖ్యనాయకుడి ఇమేజ్‌ని ప్రధాని రేంజ్ నాయకుడు అనే స్థాయిలో పెంచే ప్రయత్నం లాంటి వ్యూహాలు రూపొందించారట. అలాగే వచ్చే నాలుగైదు నెలలు అభివృద్ధి వార్తా కథలు, రాష్ట్రం అన్నింట్లో నంబర్ ఒన్‌లో ఉందన్న విశ్లేషణలతో ప్రచారం ఓ రేంజ్‌లో చేయాలన్ని నిర్ణయం తీసుకున్నారట. వైఎస్ జగన్‌తో మోడీ, కేసీఆర్‌లను కలిపి చూపించడం, వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా దాడిచేయడం, జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది అనే రేంజ్‌లో ప్రజలను భయపెట్టే స్థాయి ప్రచారం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఈ వ్యూహాలు అంతగా వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదని స్వయంగా ఒక పచ్చ పార్టీ సీనియర్ నాయకుడే అభిప్రాయపడుతున్నాడు. తెలంగాణా ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు అన్నీ వాడేశారని…….ఇక ఇప్పుడు ఎపిలో ఒక్క శాతం ప్రజలు కూడా నమ్మరన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -