ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

- Advertisement -

నిత్యా మీనన్ : అలా మొదలయింది మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యమీనన్.. చిన్నప్పుడే ఇంగ్లిష్ చిత్రం “ద మనీ హు నో టూ మచ్(1998 )”లో నటించింది.

హన్సిక : దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. “హమ్ కౌన్ హై” అనే హిందీ మూవీలో హృతిక్ రోషన్ తో కలిసి బాలనటిగా మెప్పించింది. చిన్నప్పుడు అనేక హిందీ సీరియల్స్ లోను నటిచింది.

- Advertisement -

శ్రావ్య : లవ్ యూ బంగారం మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రావ్య.. సందడే సందడి.. ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి మంచి మార్కులు కొట్టేసింది.

కీర్తి సురేష్ : నేను శైలజ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. 2000 సంవత్సరంలో వచ్చిన పైలెట్స్ మూవీలో కీర్తి నటనతో అభినందనలు అందుకుంది. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్టుగా మరో రెండు చిత్రాల్లో కనిపించింది.

శ్రీ దివ్య : హనుమాన్ జంక్షన్ సినిమాని జాగ్రత్తగా చూస్తే ఓ చిన్నారి ముద్దుముద్దుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో కాదు “మనసారా” సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్యనే.

మంజిమ మోహన్ : నాగచైతన్యకు జంటగా సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంలో నటించిన ఈ మలయాళ బ్యూటీ బాల నటిగా ఎనిమిది సినిమాలు చేసింది. 1998 నుంచే మలయాళ సినిమాల్లో నటిస్తోంది. “మధురనంబరకట్టు” అనే మూవీలో నటనకు గానే కేరళ స్టేట్ నుంచి మంజిమ మోహన్ ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.

శ్రియ శర్మ : జై చిరంజీవ సినిమాలో చిరు మేనకోడలుగా చిన్నారి శ్రియ శర్మ ముద్దుగా ఆకట్టుకుంది. దూకుడు చిత్రంలోనూ సమంతకు చెల్లెలిగా నటించి శెభాష్ అనిపించుకుంది. 2015 లో రిలీజ్ అయిన గాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అంకిత : సింహాద్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అంకిత.. చిన్నప్పుడే రస్నా వాణిజ్య ప్రకటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది.

షామిలి : చిన్నప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో కనిపించింది. రాజు.. రాజు.. అంటూ ఆకట్టుకుంది. అంజలి చిత్రంలో నటనకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఓయ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా అడుగు పెట్టి అభినయంతో అందరినీ కట్టిపడేసింది.

శ్రీ దేవి : తన నాలుగో ఏట శ్రీ దేవి కెమెరా ముందుకు వచ్చారు. “తుణైవన్” అనే తమిళ సినిమాలో బాల మురుగన్ గా నటించారు.

నిత్య శెట్టి : దేవుళ్ళు సినిమాలో నటించిన అమ్మాయి నిత్య శెట్టి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తోంది. అయితే 2016 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా చేసేసింది నిత్య. తమిళ, తెలుగు సినిమాల్లో కలిసి నిత్య శెట్టి ఏకంగా ఆరు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

శ్వేతా బసు ప్రసాద్ : శ్వేతా బసు ప్రసాద్ 2002 నుంచి 2006 సంవత్సరం వరకు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు ఈవిడ అనేక భాషల్లో 13 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు ఇవే..!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

Most Popular

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

చలికాలంలో ఏం తినాలి అని అడిగితే ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెబుతారు. బట్ ఇక్కడ మనం న్యూట్రిషియన్లు చెప్పే ఫుడ్ నే తీసుకోవల్సి ఉంటుంది. మన బాడీ మాస్ ఇండెక్స్...

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు జగపతి బాబు. హీరోగా జగపతి బాబుకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. జగపతి బాబు తండ్రి నిర్మాత...

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌...

Related Articles

ఆకట్టుకుంటోన్న ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌.

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ 'మిస్‌ ఇండియా'. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌...

కీర్తిసురేష్‌కు ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌ బర్త్‌డే విషెష్

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు కీర్తి సురేష్‌. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ...

‘రంగ్ దే’ చిత్రం లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల

'ప్రేమ' తో కూడిన కుటుంబ కధా చిత్రం 'రంగ్ దే'. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్‘ పుట్టినరోజు సంధర్భంగా ‘ రంగ్ దే‘ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...