విశాఖ టెస్టులో వరుసగా రెండో సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పిన హిట్ మ్యాన్

1792
IND vs SA 1st Test : Rohit Sharma dazzles with tons in Vizag
IND vs SA 1st Test : Rohit Sharma dazzles with tons in Vizag

పరిమిత ఓవర్ల ముద్ర వేసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ విశాఖలో సఫారీలతో జరుగుతున్న మొదటి టెస్టులో పరుగుల వరద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు. మొదటి ఇన్నీంగ్స్ లో 175 పరుగుల చేసిన రోహిత్ రెండో ఇన్నీంగ్స్ లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ప్రస్తుత టెస్టులో రోహిత్‌కిది రెండో సెంచరీ కావడం విశేషం. కేవలం 133 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 100 మార్క్‌ చేరుకున్నాడు. ఓవరాల్ గా రోహిత్ కు ఐదో సెంచరీ.

టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలో దిగి ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌ కెరీర్‌లో వైజాగ్‌ టెస్టు ప్రత్యేకంగా నిలువనుంది. సుధీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రాణించి.. కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.టీ విరామం అనంతరం స్వల్ప వ్యవధిలోనే పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 54 ఓవర్లు ముగిసేసిరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.రోహిత్‌(105), జడేజా(8) క్రీజులో ఉన్నారు

Loading...