ధోనీ రిటైర్మెంట్ పై ఓక్లారిటీ.. అతడ్ని ఓడించాలంటా..!

1155
what Dhoni Told Manjrekar About His International Future
what Dhoni Told Manjrekar About His International Future

భారత మాజీ కెప్టెన్ ధోనీ తన రిటైర్మెంట్ పై క్లారిటీగా ఉన్నట్లే అర్దం అవుతోంది. 2019 వన్డే ప్రపంచకప్‌‌ తర్వాత టీమిండియా తరుపున మ్యాచ్ లు ఆడలేదు ధోనీ. దాంతో అతని కెరీర్ పై ఇప్పటికే రూమర్స్ వస్తున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలోకి ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని కొందరు అంటుంటే.. మరికొందరేమో ధోనీ రిటైర్మెంట్ ఇస్తాడని అంటునారు.

కానీ ధోనీ మాత్రం పెదవి విప్పడం లేదు. ధోనీ తన రిటైర్మెంట్ గురించి మూడేళ్ల క్రితమే మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో ఓ మాట చెప్పినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి విందులో.. ధోనీ తనతో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు మంజ్రేకర్ వెల్లడించాడు. “కోహ్లీ పెళ్లి సందర్భంగా ధోనీతో కాసేపు పక్కన కూర్చుని మాట్లాడే ఛాన్స్ దక్కింది. ఆ టైంలో రిటైర్మెంట్ గురించి మా మధ్య చర్చ జరిగింది. ధోనీ ఒక్కటే చెప్పాడు. టీమిండియా అత్యంత వేగంగా పరుగెత్తే క్రికెటర్‌ని రేసులో ఓడించినంత కాలం.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడతాను. నా ఫిట్‌నెస్‌కి అదే ప్రమాణం’’ అని ధోనీ చెప్పాడని మంజ్రేకర్ వెల్లడించాడు.

భారత జట్టులో వేగంగా పరుగెత్తే ఆటగాళ్లలో జడేజా ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా టాప్-3లో కొనసాగుతున్నారు. 2017, డిసెంబరులో హార్దిక్ పాండ్యాని 100 మీటర్ల రేసులో ఓడించిన ధోనీ.. త్వరలోనే తన ఫిట్‌నెస్‌ని మరో రేస్‌తో నిరూపించుకుంటాడేమో చూడాలి. మరి అతనికి పోటీగా రేసులోకి దిగే క్రికెటర్‌ ఎవరో..? త్వరలోనే తేలిపోనుంది. బహుశా ఈసారి రవీంద్ర జడేజాతో ధోనీ పోటీపడొచ్చు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే.

ధోనీని ఇబ్బంది పెట్టాలనే బీమర్ వేశా : అక్తర్

ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడటం కష్టమే.. అంత ఈజీ కాదు ఇప్పుడు : రోహిత్

ముంబై ఇండియన్స్ కి షాక్.. మలింగ లేడు.. ఎందుకంటే ?

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

Loading...