Wednesday, May 1, 2024
- Advertisement -

అచ్చెన్నాను అధ్యక్షుడి ని చేయడంలో ఇంత మర్మం దాగుందా..?

- Advertisement -

చంద్రబాబు ఏం చేసినా తన పార్టీ కి, ముఖ్యంగా తనకు లాభం లేనిది చేయడు రాజకీయ వర్గాల్లో ఓ పేరుంది.. అందుకే రాజకీయ చతురుడు అని చంద్రబాబు కి పేరుంది.. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్ని ఎత్తులు పైఎత్తులు వేస్తే ఈ రేంజ్ కి వచ్చి ఉంటారు.. పార్టీ పడిపోతుందనుకున్నపుడేలా ఎదో ఒక మాయ చేసి సీఎం పదవి ఎక్కేసేవారు.. దాంతో చంద్రబాబు చేసే ప్రతి పనిలో ఓ చీకటి కోణం ఉంటుందని ప్రజలకు అర్థమయిపోయింది.. ఇక ఇప్పుడు జగన్ ప్రభంజనం తో చంద్రబాబు పార్టీ మూలకు పడ్డ పరిస్థితి..

దాంతో ఇన్నాళ్లు నిర్మించుకున్న కూడా కూలిపోయింది.. టీడీపీ పార్టీ కి పుట్టగతులు లేకుండా చేసేశాడు వైసీపీ పార్టీ అధినేత జగన్. ఓ వైపు తమ నేతలపై అవినీతి కేసులు పెరిగిపోతుండడంతో గట్టి గట్టి లీడర్లు అందరు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదు.. దాంతో తానే ఒంటరి పోరాటం చేస్తూ పార్టీ ని ఈదుకొస్తున్నాడు.. కొడుకు సంగతి ఇప్పుడు చెప్పుకోకుండా ఉంటేనే మంచిది. చంద్రబాబు ఇక పార్టీ ని మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవాలంటే ఏదైనా గట్టి నిర్ణయమే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉంది..

అందుకే ఇటీవలే జైలు నుంచి తిరిగివచ్చిన అచ్చెన్న ను పార్టీ ప్రెసిడెంట్ ని చేయాలనీ అనుకున్నారు.. ఇప్పటికే అచ్చెన్న కు ఉత్తరాంధ్ర లో తిరుగులేదు.. ఈ ఎస్ ఐ స్కాం తో ఆయన పేరు కూడా రాష్ట్రంలో మునుపటికంటే ఎక్కువగా వినపడుతుంది.. రాజకీయం లో పార్టీ లో తనకన్నా మంచి అనుభవం ఉన్న వ్యక్తి.. అలాంటి వ్యక్తి పార్టీ పగ్గాలిస్తే భవిష్యత్ లో పార్టీ ముందుకెళ్తుంది అని భావించారు.. అయితే బాబు అచ్చెన్న మీద సింపతీ తో ఈ పదవి ఇవ్వబోతున్నాడని భావిస్తే మీరు టీడీపీ లో కాలేసినట్లే .. దీనికి కారణం వేరే ఉందట.. వాస్తవానికి అచ్చెన్న కుటుంబం పార్టీ పై, చంద్రబాబు పై కొంత ఆగ్రహంగా ఉన్నారట.. ఎంపీ రామ్మోహననాయుడు,  ఆదిరెడ్డి భవానీ వంటి వారు వేరే పార్టీ లోకి వెళ్లిపోవాలని చూసిన సంగతి మనకు తెల్సిందే. అచ్చెన్నా జైలులో అంత ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు దానిపై పెద్ద గా ఆసక్తి చూపకపోవడంతో వారికి ఆగ్రహం కలిగిందట.. దాంతో పార్టీ లో ఎంతో కొంత పేరు సానుభూతి సంపాదించినా అచ్చెన్న ను మెప్పించడంకోసం బాబు ఈ పనిచేశాడని అంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -