తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ సినిమా మేనియా బలంగా కనిపిస్తోంది. ఇటివలే వరుసగా విడుదల అవుతున్న ఖైదీ టీజర్, సాంగ్స్‌కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
దాదాపు పదేళ్ల తర్వాత చిరు వెండితెరపై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు రూ. 13 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్త పాతబడకముందే కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు వార్తలొస్తున్నాయి.
ఈ క్రమంలోనే కర్ణాటక రైట్స్ విషయంలో చిరు తన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను సైతం దాటేసినట్టు తెలుస్తోంది. పవన్ ఏ సినిమా కూడా ఈ రేంజ్లో ఇక్కడ బిజినెస్ చేయలేదు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఖైదీ నెంబర్ 150 సినిమా కర్ణాటక రైట్స్ రూ. 8. 5 కోట్ల భారీ మొత్తానికి దక్కించుంది. దీన్నిబట్టి మెగా రీ ఎంట్రీ సినిమాకు ఎంతటి క్రేజ్ ఉందో అర్ధం అవుతోంది. పాత రికార్డులను పోల్చి చూస్తే కర్ణాటకలో ఇప్పటి వరకూ మరే తెలుగు చిత్రం ఇంతటి భారీ ధరకు అమ్ముడవ్వలేదు. ఇక ప్రి రిలీజ్ బిజినెస్‌లోనే ఈ రేంజ్లో రికార్డులు బద్దలు కొడుతోన్న చిరు రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్లో కలెక్షన్స్ వసు చేస్తోందో చూడాలి.
Related
