Tuesday, May 7, 2024
- Advertisement -

పేలిన అగ్నిపర్వతం.. సునామి తప్పదంటున్న సైంటిస్టులు.

- Advertisement -

అగ్నిపర్వతం పేరు వింటేనే మనకు ఒళ్ళు జిల్ అంటుంది. దీనికి కారణం అవి బద్దలైనపుడు సృష్టించే విధ్వ౦సం. భూమిలోపల దాగున్నలావాను ( molten lava)పైకి చిమ్ముతూ పరిసర ప్రాంతలన్నిటిని నామరూపాలు లేకుండా చేయగలదు ఒక అగ్నిపర్వతం. ఇటీవల టోంగా (Tonga)లోని హుంగా టోంగా అనే అగ్ని పర్వతం బద్దలైంది. టోంగా ఒక ద్వీపకల్పం. ఇది ఓషియానియా లో ఉన్న ఒక ఆర్కిపెలాగో (archipelago). అనేక ద్వీపకల్పాల సమూహాన్ని ఆర్కిపెలాగో అంటారు. దాదాపు ఒక లక్ష వరకు జనాభా కలిగి ఉన్న ద్వీప సమూహాలు ఇవి .

ఈ అగ్నిపర్వతం పసిఫిక్ ఓషన్ లో ఉంది. టోంగా ద్వీపాలు దాదాపు 40 కిలోమీటర్ల దూరం లో ఉన్నాయి .కానీ ఒక అగ్నిపర్వతం చాలా సులువుగా 45కి.మీ వరకు లావాను విసరగలదు. అయితే సముద్రం లో కదా ఉంది ,ప్రమాదం ఏమి లేదు అనుకోకండి. ఒక అగ్నిపర్వతం బద్దలయ్యేటపుడు చాలా బలమైన సీస్మిక్ తరంగాలు (seismic waves)పుడతాయి. ఇవి భూకంపాలను, సునామీలను సృస్టిస్తాయి .

జపాన్ మరుయు అమెరికా తమ దేశాలలో సునామి హెచ్చరికలు జారి చేశాయి .టోంగా మొత్తం అగ్నిపర్వతం నుంచి వెలువడే దూళితో నిండిపోయింది. వాయు కాలుష్యం వ్యాపించింది. అధికారులు తగు చర్యలు తిస్కుంటున్నారు. ఇప్పటివరకు ఆస్తి మరుయు ప్రాణనష్టం గురించి ఎటువంటి సమాచారం వెలువడలేదు. శాస్త్రవేత్తలు సునామి సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కత్రినా కావాలా? కరీనా కావాలా?

సెమీస్‌ లో పైచేయి ఎవరిది?

చిరు చిన్న కూతురు మళ్ళీ విడాకులు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -