Thursday, May 2, 2024
- Advertisement -

అసలైన పొలిటీషియన్ .. బూతులే వీరి క్వాలిఫికేషన్ !

- Advertisement -

నేటి రోజుల్లో పాలిటిక్స్ అంటేనే ప్రతి సామాన్య పౌరీడికి విరక్తి కలిగేలా చేస్తున్నారు..! నేటి తరం రాజకీయ నాయకులు. ప్రజా సమస్యలను రూపుమాపి రాబోయే తరానికి స్పూర్తి ధాయకంగా నిలవాల్సిన పోలిటికల్ లీడర్స్ వాళ్ళ విధి విధానాలను మర్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ప్రతి సామాన్య పౌరుడు రాజకీయాలు అంటేనే చీదరించుకునే స్టేజీకి దిగజార్చారు ఈ రాజకీయ నాయకులు.

ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, పి‌వి నరసింహారావు, వంటి వారు ఎంతో హుందాగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకులుగా ప్రజలలో సుస్థిర స్థానం సంపాధించుకుని, ఎంతో మందికి మార్గదర్శులుగా నిలిచారు. అంతే కాకుండా ముఖ్యంగా యువతరం రాజకీయ్యల్లోకి రావడానికి గట్టి పునాదులు వేశారు. వాళ్ళు ప్రజల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోవడానికి ప్రధాన కారణం పదవులపై వ్యామోహం లేకుండా ప్రజల కొరకు పని చెయ్యడం.

కానీ నేటి రోజుల్లో నాయకులు పదవుల వ్యామోహంలో పడి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. ప్రజాపతినిధులుగా ఉన్న వీరే ప్రజల్లోకి పచ్చి భూతులు మాట్లాడుతూ రాజకీయ నాయకుడు అనే పదానికి కొత్త అర్థం నేర్పిస్తున్నారు. దీంతో రాజకీయ నాయకుడు అంటే కచ్చితంగా బూతులు మాట్లాడాలి అనే క్వాలిఫికేషన్ తప్పనిసరి అయ్యింది. దీంతో ఈ కుల్లు పట్టిన రాజకీయ్యల్లోకి మేము రాలేమంటూ నేటి యువతరం రాజకీయాలకు దూరమౌతుంది. కానీ ఈ మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి నవయువతరం నడుం బిగించక తప్పదు.

Also Read

టార్గెట్ 2023 : ఈ ఎన్నికల్లో చెంపెట్టు ఎవరికి ..?

ఉక్రెయిన్ అమెరికా ను నమ్మడం లేదా ?

బాలకృష్ణపై రోజా సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -