వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది దక్షిణాఫ్రికా. న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో 190 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.దక్షిణాఫ్రికా విధించిన 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్…పూర్తిగా విఫలమైంది. టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా విఫలం కావడంతో 35.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే 60 పరుగులు చేసి రాణించగా కాన్వే 2,విల్ యంగ్ 33,రచిన్ రవీంద్ర 9,డేవిడ్ మిచెల్ 24,టామ్ లథమ్ 4 విఫలమయ్యారు. కేశవ మహారాజ్ 4,కుయెట్జ్ 2 జాన్సెన్ 3,రబాడా 1 వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 118 బంతుల్లో 133 , క్వింటన్ డికాక్ 114 పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. చివరలో డేవిడ్ మిల్లర్ 30 బంతుల్లో 53 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది.
ఈ ఓటమితో న్యూజిలాండ్ జట్టు నాలుగో స్థానానికి పడిపోగా కివీస్ సెమీస్కు చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. ఈ నెల 4న పాక్, 9న శ్రీలంకతో తలపడనుంది.
