Thursday, May 9, 2024
- Advertisement -

ఈటల… వాట్ నెక్ట్స్?

- Advertisement -

తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ పరిస్థితి ఏంటీ? ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన రాజేందర్..తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఢీలా పడ్డాడా..?ఇప్పుడు పాలిటిక్స్‌లో స్పెస్ లేక అల్లాడుతున్నారా..?ఈటల నెక్ట్స్ స్టెప్ ఏంటీ? ఇప్పుడు ఇదే ఆయనతో పాటు అనుచరులను వేధిస్తున్న ప్రశ్న.

2018కి ముందు 208కితర్వాత ఈటల రాజేందర్ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమకారుడిగా, తర్వాత మంత్రిగా కీలక శాఖల నిర్వహణ ఇలా కెరీర్ గ్రాఫ్ అలా పెరుగుతూ పోయింది. కానీ 2018 ఎన్నికల తర్వాత గులాబీ బాస్‌తో విభేదాలు ఆ వెంటనే బీజేపీలో చేరిక, ఉప ఎన్నికల్లో గెలుపు ఈటల గ్రాఫ్ పెరగడానికి దోహద పడ్డాయి.

కానీ రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు ఘోర పరాభవం ఎదురైంది. పోటీ చేసిన రెండు స్థానాలు గజ్వేల్‌తో పాటు తన కంచుకోట హుజురాబాద్‌లో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటికే ఈటల అంటే మండిపడుతున్న బీజేపీ సీనియర్లకు ఇది మరింత కలిసొచ్చింది. ఈటల టార్గెట్‌గా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు.ఎందుకంటే రాజేందర్ కుట్రల వల్ల బండి సంజయ్ ను అధిష్టానం అధ్యక్షుడిగా మార్చేసింది. దీనిపై బండి సంజయ్ సైతం వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.

అందుకే కీలక నేతగా ఎదిగినా పార్టీని నయవంచనతో నష్టాల్లోకి నెట్టారనే అపవాదు మూటగట్టుకున్నారు ఈటల. తనకు ఎదురు లేదని భావించినా చివరకు నిరాశే మిగిలింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నా…పార్టీ టికెట్ ఇస్తుందా అన్నది సందిగ్దమే. దీంతో ఈటల పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుండగా దీనిపై ఆయన స్పందిస్తారో లేదో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -