- Advertisement -

తీర్థయాత్రకు వెళ్లి..శవాలుగా!

- Advertisement -

బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. బిహార్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం రాజగీర్ లో నలుగురు మృతిచెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజగీర్‌లోని జైన ధర్మశాలలోని మూసివేసిన గదిలో బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పర్యాటకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

గది నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ధర్మశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, లోపలి దృశ్యం చూసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ కుటుంబం సుమారు వారం రోజుల క్రితం రాజగీర్‌కు వచ్చింది.

మూసివేసిన గది నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ధర్మశాల సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఆత్మహత్యతో పాటు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపించి, వారి కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మృతి చెందిన నలుగురూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. వీరు రాజగీర్‌కు తీర్థయాత్ర నిమిత్తం వచ్చి, దిగంబర జైన ధర్మశాలలో సుమారు వారం రోజులుగా బస చేశారు. ఒకే గదిలో నలుగురు మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -