Friday, May 3, 2024
- Advertisement -

సీపీఐ, జ‌న‌సేన బంధం తెగ‌నుందా…?

- Advertisement -

ఎన్నికల్లో జ‌న‌సేన , వామ‌ప‌క్ష పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డి క‌లసి పోటీ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించాయి. అయితే సీట్ల స‌ర్దుబాటు ద‌గ్గ‌ర తేడా కొట్ట‌డంతో విడాకులు తీసుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు. సీట్లు స‌ర్దుబాటులో గంద‌ర‌గోళం నెల‌కింద‌ని సాక్షాత్తు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అంగీకరించారు. పొత్తులో భాగంగా కేటాయించిన సీట్ల‌ల్లో పోటీ పెట్టార‌ని జ‌న‌సేన‌పై మండి ప‌డ్డారు.

విజయవాడ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయమని చెప్పిన, జనసేన ఇప్పుడు గన్నవరం అసెంబ్లీ ఇస్తామని అంటోందని ఆయన అన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా సీపీఐకి ఇచ్చిన బెజవాడ లోక్‌సభ సీటును జనసేన లాగేసుకోవడంతో కూటమి నుంచి బయటకు రావాలని సీపీఐ భావిస్తోంది. విజయవాడ లోక్‌సభ సీటుకు సోమవారం నామినేషన్‌ వేసేందుకు సీపీఐ అభ్యర్థి చలసాని అజయ్‌ కుమార్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జ‌న‌సేన త‌రుపున ఎంపీ అభ్య‌ర్ధిగా ముత్తంశెట్టి కృష్ణబాబును ప్ర‌క‌టించింది. దీంతో సీపీఐ నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కూటమి నుంచి బయటకు రావడమా? కొనసాగడమా? అనే దానిపై చర్చించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -