Tuesday, April 30, 2024
- Advertisement -

కోర్టు మెట్లెక్కిన స‌చిన్‌…

- Advertisement -

భారత దిగ్గజ ఆటగాడు స‌చిన్ టెండూల్కర్ కోర్టు మెట్లెక్కాడు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెట్ ఉపకరణాల తయారీ సంస్థ స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ పై సిడ్నీ కోర్టులో దావా వేశాడు. ఒప్పందం ప్ర‌కారం స‌చిన్‌కు ఇవ్వాల్సిన డ‌బ్బును ఆ కంపెనీ ఇవ్వ‌కపోవడంతో.. రెండు మిలియ‌న్ల డాల‌ర్ల (14కోట్లు ) న‌ష్ట‌ ప‌రిహారం కేసును న‌మోదు చేశారు.

స్పార్టన్ సంస్థ తన పేరును, ముఖచిత్రాన్ని వాడుకుని తనకు చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించలేదంటూ సచిన్ తన దావాలో పేర్కొన్నాడు. తనతో స్పార్టన్ 2016లో ఒప్పందం కుదుర్చుకుందని, కానీ తనకు చెల్లించాల్సిన 20 లక్షల డాలర్లను ఇంతవరకు చెల్లించకపోగా, తాను పంపిన సందేశాలకు సైతం బదులు ఇవ్వలేదని సచిన్ వివరించాడు.

స్పార్ట‌న్ కంపెనీ త‌న బ్యాట్ల‌పై స‌చిన్ లోగో, ఇమేజ్‌ను ముద్రించింది. స‌చిన్ బై స్పార్ట‌న్ అన్న ట్యాగ్‌లైన్‌తో ఆ కంపెనీ త‌న ఉత్ప‌త్తుల‌ను మార్కెట్లో విక్రయించింది. ఒప్పందం ప్ర‌కారం త‌నకు చెల్లించాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని స‌చిన్ త‌న దావాలో పేర్కొన్నారు. స్పార్టన్ సంస్థ ప్రచారం కోసం లండన్, ముంబయి వంటి మహానగరాల్లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని వెల్లడించాడు. దీనిపై విచారణ జరిపి తనకు రావాల్సిన పారితోషికాన్ని చెల్లించేలా చూడాలని సచిన్ తన దావాలో కోరాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -