పాపం.. బాలీవుడ్ ను అమీర్ ఖాన్ కూడా కాపాడలేకపోయాడా ..?

ప్రస్తుతం బాలీవుడ్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. బాలీవుడ్ నుంచి ఏ చిత్రం వచ్చిన కూడా రిజెక్ట్ చేస్తున్నారు నార్త్ ఆడియన్స్. ఇటీవల వరుసగా హిందీ బడా హీరోల మూవీస్ కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం అవుతుండడంతో ఏం చేయాలో తెలియక తలపట్టేసుకుంటుంది బాలీవుడ్ చిత్రా పరిశ్రమ. ప్రస్తుతం హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాల వైపు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు బాటలు వేసిన బాహుబలి దారిలోనే కే‌జి‌ఎఫ్, పుష్ప సినిమాలు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లు నమోదు చేయడంతో హిందీ హీరోలను నార్త్ ఆడియన్స్ దూరం పెడుతున్నారేనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అక్కడి స్టార్ హీరోలను కూడా పక్కన పెట్టేంతలా క్రేజ్ లో మన సౌత్ హీరోలు సత్తా చాటుతున్నారు. ఈ మద్య కాలంలో హిందీ స్టార్ హీరోల నుంచి వచ్చిన ఏ మూవీ కూడా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. అక్షయ్ కుమార్, రన్ వీర్ సింగ్, రణ్ బీర్ కపూర్, శాహిద్ కపూర్ వంటి ఆగ్రహీరోల సినిమాలను సైతం చూసే ఆడియన్స్ లేక బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలుతున్న సౌత్ క్రేజ్ ను తగ్గించేందుకు.. అమీర్ ఖాన్ ” లాల్ సింగ్ చద్దా ” మూవీ పైనే ఆశలు పెట్టుకుంది బాలీవుడ్. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన మొదటి రోజు ( ఆగష్టు 11 ) నుంచే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

దాంతో ” లాల్ సింగ్ చద్దా ” ద్వారా బాలీవుడ్ చిత్రా పరిశ్రమ కు పూర్వ వైభవం వస్తుందని భావించినప్పటికి అమీర్ ఖాన్ కూడా చేతులెత్తేయడంతో దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది బాలీవుడ్ చిత్రవర్గం. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ గా పేరున్న అమీర్ ఖాన్ మూవీని సైతం నార్త్ ఆడియన్స్ రిజక్ట్ చేశారంటే.. హిందీ ఆడియన్స్ సౌత్ సినిమాలకు ఎంతలా అడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

Also Read: రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దం ?

Related Articles

Most Populer

Recent Posts