Friday, May 10, 2024
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో దొంగలు ?

- Advertisement -

తెలుగు సినీ నటీనటుల సంఘం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో నిధుల గోల్ మాల్ జరిగినట్లు కొద్దిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ‘మా’ ‘సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి విదేశాల్లో ప్రదర్శన హక్కులు విషయంలో అవకతవకలు జరిగాయని ఇండస్ట్రీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. ‘మా’ లో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇద్దరు సీనియర్ నటులు సహా పలువురి పేర్లు చెబుతూ వీళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పలు ఇంగ్లిష్ న్యూస్ చానెల్స్, పేపర్స్ కూడా ఈ ఆరోపణలపై కథనాలు కొద్ది రోజుల క్రితం ప్రచురించాయి. అయితే ‘మా’ ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్ ఈ ఆరోపణలపై పెదవి విప్పడానికి ఇష్టపడటం లేదు. అంతా సవ్యంగానే ఉందని చెబుతూనే ఆయన ముభావంగా ఉంటున్నారు. ‘మా’ నిధులకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని, వెంటనే లెక్కలు తేల్చాలని మాలోని సభ్యత్వం ఉన్న పలువురు నటీనటులు డిమాండ్ చేస్తున్నారు. మీరు లెక్కలు చూపుతారా ? లేక మమ్మల్నే రికార్డులు తనిఖీలు చేసుకోమంటారా ? అని గట్టిగానే అడగటంతో సీనియర్ నరేశ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలుమార్లు అంతర్గత వ్యవహారాలు, ‘మా’ ఎన్నికలు, శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ మీట్లు పెట్టి వేలకు వేలు ఖర్చు అనవసరంగా చేస్తున్నారనే ఆరోపణలతో ఇండస్ట్రీ పరువు పోయిందని సినీ పెద్దలు లబోదిబోమన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వివాదం రాజుకుంటుండంతో నరేశ్ మా ఆఫీస్ లోని రికార్డులు అన్నీ తన స్వాధీనంలో ఉంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. సభ్యులందరితో అత్యసవర మీటింగ్ కూడా నేడు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అసలు తమపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత ? అబద్ధమెంత ? తేల్చేందుకే ఈ అత్యవసర మీటింగ్ పెడుతున్నట్లు సమాచారం. విదేశాల్లో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు కార్యక్రమాలు ఏర్పాటుకు, హక్కుల అమ్మకం సహా పై ఆరోపణలపై చర్చలు జరపనున్నారు. అయితే నిజానిజాలు బయట పెడతారా ? లేక వారిలోవారే సర్ది చెప్పుకుని, ఇవన్నీ పుకార్లే, అనవసరంగా మాపై బురదజల్లుతున్నారు. అని చెప్పుకొస్తారో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -