Saturday, May 25, 2024
- Advertisement -

‘భైర‌వ‌గీత’ రివ్యూ

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు సిద్ధార్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం భైర‌వ‌గీత.చిత్ర టైటిల్ నుంచి విడుద‌ల వ‌ర‌కు అన్ని తానై న‌డింపించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమాకు మొద‌టి నుంచి పాజిటివ్ బ‌జ్ ఉండ‌టంతో భైర‌వ‌గీతపై ఆస‌క్తి పెరిగింది.రాయలసీమ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాఈ రోజే విడుద‌ల అయింది.ఇప్ప‌టికే క‌న్న‌డలో విడుద‌ల అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అక్క‌డి నుంచి వ‌స్తున్న సామాజిక మాధ్య‌మ‌ల ద్వారా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం సినిమా బాగానే ఉంద‌ని తెలుస్తుంది.రెండు భాష‌ల‌లోను ధనుంజయ, ఇర్రా మోర్ హీరో,హీరోయిన్లుగా న‌టించారు.అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం సినిమాకు యావ‌రేజ్ టాక్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది.కొత్త ద‌ర్శ‌కుడు అయిన‌ప్ప‌టికి రాయలసీమ బ్యాక్ డ్రాప్‌ను బాగానే హ్యాండిల్ చేశాడనే అంటున్నారు సినిమా చూసిన‌వారు.సినిమాలో యాక్ష‌న్‌తో పాటు రొమాన్స్ కూడా చాలా ఘాటుగా ఉంద‌ని తెలుస్తుంది.హీరోయిన్ ఇర్రా మోర్ అందాలు ప్రేక్ష‌కుల‌ను క‌ళ్లు పక్కకి తిప్పుకోకుండా చేస్తాయ‌ని అంటున్నారు ప్రేక్ష‌కులు.

సినిమాలో లిప్‌లాక్‌ల‌కు కొద‌వ లేద‌ని తెలుస్తుంది.ఫ్యామిలీతో క‌లిసి ఈ సినిమా చూడ‌టం కాస్తా క‌ష్ట‌మేన‌ట‌.అయిన‌ప్ప‌టికి యూత్ ,మాస్ ప్రేక్ష‌కులు మెచ్చే అంశాలు సినిమాలో చాలా ఉండంటంతో సినిమాపై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్‌.సినిమా పూర్తి రివ్యూ మ‌రి కొద్దిసేప‌ట్లో మీ ముందు ఉంచుతాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -