Friday, March 29, 2024
- Advertisement -

ఆంజనేయుడు అందరివాడు.. వివాదాలపై బ్రహ్మానందం

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఆంజనేయస్వామి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), కర్ణాటకలోని కిష్కింధ సంస్థాన్ ట్రస్టు మధ్య చలరేగిన వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. హనుమంతుడు మావాడని టీటీడీ అంటే.. కాదు, మావాడేనంటూ కిష్కింధ సంస్థాన్ చెబుతోంది. ఇక దేవుళ్లు ఏ ప్రాంతంలో పుట్టారనే విషయాన్ని పట్టించుకోకుండా… వారికి భక్తులు ఎంతో భక్తిభావంతో పూజలు చేసుకుంటుంటారు. కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని వ్రతాలు చేసుకుంటుంటారు. ఇలాంటి సమయంలో ఒక దేవుడి గురించి ఒకేదేశంలో వేరు వేరు ప్రాంతాల వారు వివాదం పెట్టుకోవడం పై పలువురు పెదవి విరుస్తున్నారు.

తాజాగా ఓ టీవీ ఛానల్లో హనుమత్ జన్మస్థల తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతితో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం లైవ్‌లో ఫోన్ కాల్‌లో అందుబాటులోకి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భక్తికి నిదర్శనం హనుమంతుడని ఆయన అన్నారు. ఆయన ఎక్కడ పుట్టారనే విషయాన్ని వివాదాస్పదం చేయరాదని కోరారు. ఆంజనేయుడు అందరివాడని… ఆయన అంశాన్ని వివాదాస్పదం చేయరాదని సూచించారు.

నిజానికి ఆంజనేయ స్వామి పుట్టినది ఏ ప్రదేశమైనా, ఏ క్షేత్రమైనా, ఏ భూమైనా.. భరత భూమిలో పుట్టినోడే కదా! ఆంజనేయుడు కేరళలో పుట్టారా? కర్ణాటకలో పుట్టారా? ఆంధ్రాలో పుట్టారా? అనడం కంటే.. మనమందరం కలిసి ఆయన భారతదేశంలో పుట్టాడు అనుకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి అని అన్నారు. హనుమంతుడు ఎక్కడ పుట్టారనే విషయంపై వాదనలు చేసుకోవడం సరికాదని… ఆయన మన దేశంలో పుట్టారని గర్వపడితే బాగుంటుందని చెప్పారు.

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి రిచా గంగోపాధ్యాయ

భజరంగీ భాయ్‌జాన్‌ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -