Friday, April 26, 2024
- Advertisement -

స్టాలిన్ రేంజ్ లో అభిమానులను రిక్వెస్ట్ చేసిన చిరు.. ఎందుకో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా క్లిష్ట పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారికి తోచిన సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు.ఇదే తరహా లోనే మొదటి దశ కరోనా వ్యాపించినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)’ని ఏర్పాటు చేసి ఎంతో మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను, నగదు అందజేశారు. అయితే ప్రస్తుతం రెండవ దశ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ట్రస్టు ద్వారా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి సరైన సమయంలో ఆక్సిజన్, ప్లాస్మా చికిత్స లభించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మా దానం చేయడం వల్ల నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని వైద్య అధికారులు చెబుతున్నారు.

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను ప్లాస్మా దానం చేయాల్సిందిగా వేడుకుంటున్నారు. తాజాగా కరోనా బారి నుంచి బయటపడిన వారు ప్లాస్మా దానం చేసి నలుగురు ప్రాణాలను కాపాడాలని, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాల్సిన సమయం ఇదేనని చిరంజీవి పిలుపునిచ్చారు.ప్రత్యేకించి తన అభిమానులకు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మెగాస్టార్ “స్టాలిన్” సినిమా తరహాలో ట్వీట్ చేశారు.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -