వనిత నాలుగో పెళ్లి.. ఫొటోలు వైరల్​..!

- Advertisement -

వనితా విజయ్​ కుమార్​ నిత్యం వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. తరచూ ఏదో ఒక అంశంలో ఆమె వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బిగ్​బాస్ తో ఫేమస్​ అయిన వనిత.. ఆ తర్వాత ఎన్నో వివాదాస్పద ప్రకటనలు చేసింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం సైతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె మూడు పెళ్లిల్లు చేసుకొని విడాకులు ఇచ్చింది. తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకున్నదంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది.

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్ , నటి మంజుల దంపతుల పెద్ద కూతురే వనిత అన్న విషయం తెలిసిందే. ‘చంద్రలేఖ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బిగ్​బాస్​ షోలో హల్​చల్ చేసింది. ఇటీవల ఓ టీవీ షో విషయంలోనూ సీనియర్​ నటి రమ్యకృష్ణతో గొడవ పడి బయటకు వచ్చేసింది.

- Advertisement -

ఇదిలా ఉంటే తాజాగా వనిత పెళ్లి ఫొటోను షేర్‌ చేసి అభిమానులకు షాక్​ ఇచ్చింది. పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్​ ఆశ్చర్యపోయారు. ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కొందరు కామెంట్లు పెట్టారు.

మరి కొందరు ఈ మొగుడితోనైనా కొంతకాలం ఉంటావా? లేక ఇతడిని కూడా వదిలేస్తావా? అంటూ కామెంట్లు పెట్టారు. ఈ పిక్​ సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యింది. అసలు విషయం ఏమిటంటే.. నిజానికి వనిత కొత్తగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఈ సినిమా షూటింగ్​ లో భాగంగా జరిగిన వివాహం అది. అయితే సినిమా ప్రమోషన్​ కోసమే.. ఆ చిత్ర యూనిట్​ ఇటువంటి ట్రిక్ ప్లే చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read

కుమ్రంభీంకు ముస్లిం టోపీ.. రచయిత విజయేంద్ర ప్రసాద్​ రియాక్షన్​ ఇదే..!

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

సినీ మేకర్స్ కి ఈ లీకుల బాధ తప్పదా..! బ్రేక్ పడేదేలా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -