Sunday, April 28, 2024
- Advertisement -

ఫలక్నూమా దాస్ కి అన్ని కోట్లిచ్చారా?

- Advertisement -

అప్పుడెప్పుడో ఫాలక్నోమా దాస్ అనే సినిమా ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు అనే వార్తలు వచ్చాయి కానీ తీరా చూస్తే ఈ సినిమా ప్రైమ్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చింది. దీని పై కొంత చర్చ జరుగుతున్న నేపథ్యం లో అసలేం జరిగిందో ఇక్కడ వివరించడం జరిగింది.

సాధారణం గా నెట్ ఫ్లిక్స్ ఒక సినిమా ని కొనుక్కుంది అంటే, డీల్ ప్రకారం ఫైనల్ అయిన డబ్బులని ఒకేసారి అమ్మిన పార్టీ కి ఇవ్వదు. వాళ్ళ సంస్థ పాలసీల ప్రకారం మూడు నెలలకొకసారి నాలుగు ఇన్ స్టాల్ మెంట్స్ ద్వారా సరిగ్గా ఒక సంవత్సర కాలం లో మొత్తం క్లియర్ చేస్తుంది. అయితే ఇలాంటి పద్ధతి కొంతమందికి మాత్రమే వర్క్ ఔట్ అవొచ్చూ కానీ చాలా మంది కి వర్క్ అవుట్ కాకపోవొచ్చు. అందుకే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు సినిమాలు చాలా తక్కువ ఉంటాయి.

బట్ ఎమెజాన్ విషయం అలా కాదు. అగ్రీమెంట్ అవగానే ఫుల్ అమౌంట్ ఒకేసారి ఇచ్చేస్తారు. అలా నెట్ ఫ్లిక్స్ రూల్స్ ప్రకారం సంవత్సరం పాటు నాలుగు ఇన్ స్టాల్ మెంట్స్ తీసుకోవడం ఇష్టం లేకే ఈ చిత్ర యూనిట్ సినిమా ని అమెజాన్ ప్రైమ్ కి అమ్మేసారట. అది కూడా నెట్ ఫ్లిక్స్ ఇస్తాము అన్న అమౌంట్ కన్నా ఇంకొక 5లక్షల ఎక్కువ ధరకి ఈ సినిమా ని అక్షరాలా 2కోట్ల 15లక్షలకి అమెజాన్ కొనుక్కుంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వెబ్ సైట్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -