ఆ డాన్స్ మాస్టర్ కి పవన్ హెల్ప్ చేస్తాడా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అంటే గబ్బర్ సింగ్ అని చెప్పుకోవచ్చు. వరుస పరాజయాలతో చతికిల పడ్డ పవన్ కల్యాణ్ కెరీర్ గబ్బర్ సింగ్ అనే చిత్రం తో మరలా గాడి లో పడింది. హరీష శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

దేఖో దేఖో గబ్బర్ సింగ్ అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను అలరించిన ఈ పాట కి గణేష మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశాడు.

ప్రస్తుతం గణేష్ మాస్టర్ సినిమాలకి దర్శకత్వం చేసే పని లో నిమగ్నం అయ్యి ఉన్నాడట. ఎప్పటి నుండో దర్శకుడిగా మారాలి అన్న తన చిరకాల కోరికను మరి కొద్ది రోజుల్లో తీర్చుకోనున్నాడు అని తెలిసింది. రాఘవ లారెన్స్, ప్రభు దేవా, రాజు సుందరం మాస్టర్ వంటి వారి లాగా తను కూడా దర్శకుడిగా మారి కొన్ని మంచి కథలను ప్రేక్షకుల ముందుకు పెట్టాలి అనే ఆశ తో ముందుకు వెళ్తున్నాడు గణేష్. ఇప్పటికే ఒకటి రెండు పెద్ద నిర్మాణ సంస్థలకు అప్రోచ్ అయ్యి తన కథని వినిపించిన గణేష్ ఒక పెద్ద హీరో తో తన అరంగేట్రం చేస్తే బావుంటుంది అనే ఆలోచన తో అడుగులు వేస్తున్నాడు. మరి తనకి ఎంతగానో పేరు తెచ్చిన గబ్బర్ సింగ్ సినిమా హీరో పవన్ కల్యాణ్ గణేష్ మాస్టర్ కి ఏమన్నా సహాయం చేస్తాడా అనేది వేచి చూడాలి

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -