ఢీ రాజుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పూర్ణ..!

- Advertisement -

బుల్లితెరపై ఢీ షోకి మంచి క్రేజ్ ఉంది. ‘ఢీ’ ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఢీ’ షో.. పన్నెండో సీజన్‌ గా ‘ఢీ చాంపియన్స్’ పేరిట ప్రసారం అవుతోంది. ఈ సీజన్ కూడా పోటీ పోటీగా జరుగుతోంది. అయితే ఢో షో లో కేవలం డ్యాన్స్ లు మాత్రమే కాదు.. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ సహా జడ్జులు అందరూ కలిసి స్టేజ్‌పై నవ్వులు పూయిస్తుంటారు.

అందుకే ఈ షోకి ఆ రెంజ్ క్రేజ్ వచ్చింది. ప్రధానంగా యాంకర్ ప్రదీప్ టైమింగ్ బాగుంటుంది. అయ్తే ఇటీవలే అతను ఈ షోకి దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో యాంకర్ రవి, వర్షిణి షోలోకి ఎంటర్ అయ్యారు. ఎప్పటి లాగే ఈ సీజన్‌లో కూడా రష్మీ – సుధీర్‌ను షో నిర్వహకులు బాగా వాడుకుంటున్నారు. వీళ్లిద్దరిపై ఏదో రకమైన స్కిట్టులు రాయడంతో పాటు రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి కూడా పెడుతున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు ఈ షో వైపు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు.

- Advertisement -

తాజాగా ఢీ షోకి సంబంధించి వచ్చే వారం ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో జడ్జ్‌ల్లో ఒకరైన హీరోయిన్ పూర్ణకు.. ఢీ కంటెస్టెంట్ రాజుతో ఎంగేజ్‌మెంట్ అయినట్లు చూపించారు. ఇందులో రాజు.. మోకాళ్లపై కూర్చుని పూర్ణ వేలికి ఉంగరం పెట్టాడు. దాంతో ఇది ఇప్పుడు వైరల్ అయింది. ఇక పూర్ణ అలియాస్ షామ్నా కాసిం.. రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును’, ‘అవును 2′ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -