Monday, April 29, 2024
- Advertisement -

ఇదేమి ల‌వ్ స్టోరీ సినిమా నాయ‌నా..

- Advertisement -

ఒక‌నాటి ల‌వ‌ర్ బాయ్ కొన్ని సంవ‌త్స‌రాల నుంచి తెలుగు సినిమాల్లో క‌నిపించ‌కుండాపోయాడు. విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించిన ఆ హీరో ఆ త‌ర్వాత ఫ్లాపు బాగా అందుకోవ‌డంతో టాలీవుడ్‌కు దూర‌మ‌య్యాడు. ఎప్పుడో ఏదో ధైర్యం చేసి విజ‌య‌వంత‌మైన క‌న్న‌డ సినిమా రీమేక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇప్పుడు ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌నకు జీవం ఇచ్చిన ల‌వ‌ర్స్ డే నాడు ‘ఇది నా ల‌వ్‌స్టోరీ’ సినిమాతో థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చాడు. మరీ ఈ సినిమాతో త‌రుణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా? లేదో మీరే చూడాలి.

క‌థ: అభిరామ్‌ (తరుణ్‌) యాడ్‌ ఫిలిం డైరెక్టర్ తల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో త‌న చెల్లెలుతో క‌లిసి ఉంటాడు. అయితే త‌న చెల్లెలు ఒక‌ర్ని ప్రేమించడంతో వారిద్ద‌రికీ పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఈ స‌మ‌యంలో త‌న అన్న‌కు చెల్లెలు త‌న ల‌వ‌ర్ చెల్లెలును ఇచ్చి పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఈ నేప‌థ్యంలో త‌న అన్న‌ను ల‌వ‌ర్ చెల్లెలును క‌లిపాల‌ని చూస్తుంది. ఆమెను క‌ల‌వ‌డానికి అభిరామ్ అర‌కు వెళ్తుండ‌గామార్గ‌మ‌ధ్యంలో ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. అటు నుంచి ఇంటికి వెళ్ల‌గా అక్క‌డ త‌ను చూసిన అమ్మాయే క‌నిపిస్తుంది. తనే శృతి (ఓవియా). త‌న‌కు కాబోయే బావ‌కు చెల్లెలు. ఈ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అభిరామ్‌, శృతి మ‌న‌సు విప్పుకొని మాట్లాడ‌తారు. ఇద్దరు తమ తొలి ప్రేమకథలను పంచుకుంటారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రికీ ప్రేమ పుడుతుంది. అయితే మరుసటి రోజు తెల్లారిసరికి హ‌ఠాత్తుగా పోలీసులు అభిరామ్‌ను ప‌ట్టుకెళ్లారు? అభిరామ్‌ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? శృతి ఏం చేసింది? చివరకు అభిరామ్‌, త‌న చెల్లెలు ఏమ‌య్యారు? అనేది మిగ‌తా సినిమా.

క‌న్న‌డ సినిమా ‘సింపుల్‌ ఆగి ఒందు లవ్‌స్టోరీ’కు రీమేక్‌గా సినిమాను తీశారు. ఆ సినిమాకు ఈ సినిమాకు ఎక్క‌డా పోలిక ఉండ‌దు. హీరోహీరోయిన్ల జంట బాగానే క‌నిపించినా వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ క‌నిపించ‌లేదు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తీయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. ప్రేమ కథలు తీసే విధానం గందరగోళంగా ఉంది. ఫ‌స్టాఫ్ బోర్ కొట్ట‌గా సెకండాఫ్ కొంచెం రిలీఫ్‌గా ఇచ్చేట‌ట్టు ఉంది. అయితే క్లైమాక్స్ సీన్స్ సాగదీశారు. సినిమా తీయ‌డంలో దర్శకుడు గంద‌ర‌గోళానికి గుర‌య్యాడు. చాలా సన్నివేశాలు డైలాగ్స్ కోసం తీసిన‌ట్టు క‌నిపిస్తోంది. పాత కథను కొత్తదనంగా తీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

రీమేక్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. రెండు గంటల సినిమాలో ఒక్క సీన్‌ను కూడా ఆసక్తికరంగా రూపొందించలేకపోయారు. డైలాగ్స్‌ అవసరం లేకపోయినా ఇరికించాడు. పంచ్‌ డైలాగ్స్ బోలెడు పెట్టినా విసుగుతెప్పిస్తాయి. శ్రీనాథ్ విజయ్ సంగీతం సోసో. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు బాగున్నా సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. త‌రుణ్ ల‌వ‌ర్ బాయ్‌గా ఆక‌ట్టుకున్న ఓవియా ప‌రవాలేద‌నిపించింది. ఇక ఈ సినిమాతో త‌రుణ్ కెరీర్ ఇంకా ప్ర‌మాదంలో ప‌డింది.

న‌టీన‌టులు: త‌రుణ్‌, ఓవియా, మంచు మ‌నోజ్
ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ గోపి
నిర్మాత‌: ఎస్‌.వి.ప్ర‌కాశ్‌
స‌ంగీతం: శ‌్రీనాథ్ విజ‌య్‌
సంస్థ‌: రామ్ ఎంటర్ టైనర్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -