Friday, April 26, 2024
- Advertisement -

భీమ్లా నాయక్‌ సినిమా క్యాస్టింగ్‌లో ఆసక్తికర విషయాలు

- Advertisement -

భారీ అంచనాల మధ్య విడుదలైన భీమ్లానాయక్ అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా 90 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మలయాళం సినిమాకు రీమేక్‌గా వచ్చిన భీమ్లా నాయక్‌లో క్యాస్టింగ్ చాలా ఆసక్తికరంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు హీరోగా పవన్ కల్యాణ్‌ను అనుకోకముందే రానాను ఎంపిక చేశారు. అయితే రానా కంటే ముందు ఆ పాత్ర కోసం మరో హీరోగా అనుకున్నారు. నిజానికి అయ్యప్పనుమ్ కోశీయుమ్ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పుడు బాలకృష్ణ, మంచు విష్ణు హీరోలుగా రీమేక్ చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్య సినిమాకు నో చెప్పడంతో ఆ ప్రతిపాదన అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత హారిక హాసిని క్రియేషన్స్ సీన్‌లోకి రావడం.. త్రివిక్రమ్ స్క్రిప్ట్ బాధ్యత తీసుకోవడం.. పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ ఒప్పుకోవడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి.

అప్పుడు మంచు విష్ణు మిస్ చేసుకున్న పాత్రలోకి రానా దగ్గుబాటి వచ్చాడు. బాలకృష్ణ అనుకున్న పాత్రలో పవన్ కళ్యాణ్ చేశాడు. ఈ సినిమాలో డానియల్ శేఖర్ క్యారెక్టర్లో అదరగొట్టాడు దగ్గుబాటి హీరో. ఆయన కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. మరి ఒకవేళ డానియల్ శేఖర్‌గా మంచు విష్ణు నటించి ఉంటే ఎలా ఉండేదో..?

బాహుబలి 3 రాబోతోందా? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనుసూయ

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -