Saturday, April 20, 2024
- Advertisement -

ఎమోషనల్ పోస్టు పెట్టిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

- Advertisement -

శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. తినడానికి తిండి లేదు. ఇంధనం, ఔషధాలు ఇలా అన్నింటా కొరత. ఒకవేళ మార్కెట్ లో దొరికినా కొనుక్కునేందుకు జనం దగ్గర తగినంత డబ్బులేదు. ఆఖరికి ఇంకు, పేపర్ లేక అక్కడి ప్రభుత్వం పరీక్షలు సైతం రద్దు చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న శ్రీలంకలో పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ సంక్షోభంపై శ్రీలంకకి చెందిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టింది.

శ్రీలంక వాసిగా, నా దేశం, నా ప్రజలు కష్టాలు చూస్తుంటే హృదయం తట్టుకోలేకపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలను వింటున్నాననీ..కళ్లకు కనిపించే దాన్ని చూసి వెంటనే ఓ నిర్ణయానికి రాకండి అంటూ కోరింది. నా ప్రజలకు ఇతరుల జడ్జిమెంట్ అవసరం లేదు. ఈ సమయంలో వారికి కావాల్సింది మీ నుంచి సానుభూతి, మద్దతు మాత్రమేనని వ్యాఖ్యానించింది. మీ కామెంట్స్ కంటే రెండు నిమిషాల మీ నిశ్చబ్ధ ప్రార్థన వారికి బలాన్ని చేకూరుస్తుంది.

అంతే కాదు మిమ్మల్ని వారికి దగ్గర చేస్తుందని రాసుకొచ్చింది. త్వరలో ఈ పరిస్థితి నుంచి శ్రీలంక గట్టెక్కుతుందని ఎమోషనల్ పోస్టు పెట్టింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పెట్టిన పోస్టుపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే.. మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. రెండు నిమిషాలు ప్రార్థించడం కన్నా వారికి ఆర్థిక సాయం చేయలని కొందరంటుంటే..ఎటువంటి సహాయం చేయకుండా కేవలం పోస్ట్ మాత్రమే చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

త్వరలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -