Friday, May 3, 2024
- Advertisement -

‘సీత’ మూవీ రివ్యూ

- Advertisement -

ఈ మధ్యనే ‘కవచం’ సినిమాతో మరొక డిజాస్టర్ ను నమోదు చేసుకున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే సినిమా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం 00సుంకర నిర్మించిన ఈ చిత్రం ఇవాళ అనగా మే 24 న విడుదలైంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ‘సీత’సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ కు కీలకం కానుంది. మరి ఈ సినిమా తో బెల్లంకొండ హిట్ అందుకున్నాడో లేదో చూద్దాం.

కథ:
సీత (కాజల్) ఒక కన్స్ట్రుక్షన్ కంపెనీ ని నడుపుతున్న సమయం లో ఒక స్లం ఏరియా లో ఇళ్ళు ఖాళీ చేయించడానికి ఎమ్మెల్యే బసవరాజ్ (సోను) సాయం తీసుకుంటుంది. దాని కి గాను కాజల్ తన తో పటు నెల రోజులు కలిసి ఉండాలి అని కండీషన్ పెడతాడు బసవరాజ్. ముందు ఒప్పుకొని పని పూర్తి కాగానే కాజల్ మొహం చాటేస్తుంది. అందుకు హర్ట్ అయినా బసవ వెంటనే తనని విమర్శలకి గురి చేయాలి అని చూస్తాడు. ఆ సమయం లో సీత ని కాపాడడానికి రామ్ (బెల్లంకొండ) వస్తాడు. ఎవరీ రామ్? సీత ని కాపాడాడా? చివరికి ఏం అయింది? అనేది ఈ సినిమా కథ.

నటీనటులు:
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరికీ పర్ఫామెన్స్ కి బాగా స్కోప్ ఉన్న పాత్రలు లభించాయి. ఇప్పటిదాకా సాయి శ్రీనివాస్ మునుపెన్నడు కనిపించనటువంటి మంచి పాత్రలో ఈ సినిమాలో కనిపించడమే కాక తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరోవైపు తన పాత్రలో కొన్ని నెగటివ్ షెడ్లు ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ ఆ పాత్రలో సునాయాసంగా నటించింది. సోను సూద్ నటన ఈ సినిమాలో చాలా కీలకంగా మారింది. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తాడు. ఒకవైపు తన అందంతో ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే మన్నారా చోప్రా తన నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది. తనికెళ్ళ భరణి చాలా సహజంగా నటించారు. అభినవ్ గోమాటం నటన బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:
ఇంతకుముందు తేజ దర్శకత్వం వహించిన సినిమాలతో పోలిస్తే ‘సీత’ సినిమా చాలా కొత్తగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా చాలా రొటీన్ గా ఉంది. అంతేకాక ఈ సినిమాలో తన నెరేషన్ మరింత మెరుగు పడిందని భావిస్తే తేజ ఫాలో అయి కోతదనం చూపడం లో విఫలమయ్యాడు. ప్రీ క్లైమాక్స్ సీన్లలో కొంత సెంటిమెంట్, యాక్షన్ ఎక్కువైనప్పటికీ సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులను అలరించడంలో తేజ సక్సెస్ కాలేకపోయాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకం అందించిన నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్మాతలు వ్యవహరించినట్లు తెలుస్తోంది. కానీ కంటెంట్ మాత్రం నీరుత్సాహ పరిచేలా ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం చాలా రొటీన్ గా అనిపించింది. శీర్షా రే కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

తీర్పు:
‘సీత’ సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. టీజర్ మరియు ట్రైలర్లలో చూపించినట్లే మొదటి హాఫ్ మొత్తం కామెడీ తో నిండి ఉంటుంది. కానీ సెకండ్ హాల్ఫ్ మాత్రం పేలవం గా ముగిసింది. అందరు నటీనటులు అద్భుతమైన నటన కనబరిచారు. మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. అందువలన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ బాగా బోర్ అనిపిస్తుంది. దర్శకుడు తేజ. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషన్స్ ను కొంచెం భారీగా ఇరికించడం తో అది జనాలకి ఏ మాత్రం ఎక్కలేదు. పైగా కథ కొంచెం స్లో అయినట్టు అనిపించడం తో ఇక చూసే వాళ్లకి పేషన్స్ నశిస్తుంది. ఓవరాల్గా ‘సీత’ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఓపిక ఉంటె ఒక్కసారి చూడొచ్చు.–

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -