కళ్యాణ్ రామ్ చేసేది నాగ శౌర్య సినిమా

- Advertisement -

సతీష్ వేగేశ్న.. తెలుగు లో శతమానం భవతి అనే సినిమా తో నేషనల్ అవార్డు పొందిన దర్శకుడు. పెళ్ళి చుట్టూ రెండు సినిమాలు తీసిన ఈ దర్శకుడు కుటుంబ కథలని తెరకెక్కించడం లో దిట్ట అని అందరూ చెప్పుకుంటారు. శ్రీనివాస కళ్యాణం సినిమా పరాజయం పాలయ్యాక ఈ దర్శకుడు తదుపరి సినిమా ఏం అయ్యి ఉంటుంది అని అందరూ అనుకున్నప్పటికీ అయన కాస్త సమయం తీసుకొని ఒక కథ ని సిద్ధం చేసుకున్నారు. ఈ కథ ని ముందుగా నాగ శౌర్య తో చేయాలి అనుకోని అతనికి కథ కూడా వినిపించారు. శౌర్య కూడా కథ నచ్చి వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఇక మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా అధికారికం గా సెట్స్ పైకి వెళ్తుంది అనుకుంటున్నా తరుణం లో శౌర్య ఈ సినిమా నుండి వైదొలిగాడు. శౌర్య ఎందుకు ఇలా చేసాడో తెలియదు కానీ ఈ కథ ని దర్శకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కి వినిపించాడు. కథ విన్న వెంటనే చెయ్యడానికి ఒప్పుకున్నాడట. అయితే కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం ఒక సినిమా ఉంది. అది పూర్తి కాగానే ఈ కొత్త సినిమా ని బరిలోకి తేవాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -