Thursday, May 2, 2024
- Advertisement -

మరో కాంట్రవర్సీ కి తెరలేపిన వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సాంగ్ విడుదల..

- Advertisement -

సంచనాలకు మారుపేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ప్రతీ సినిమా వివాదాలతోనె మొదలవుతుంది. తాజాగా మరో సంచలనానికి తెరలేపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు రాజకీయాన్ని నాటకీయంగా మార్చిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు. వర్మ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన వర్మ… శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని ట్వీట్ చేసిన వర్మ.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒట్టు వేశారు. పాటను కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చిన తర్వాత.. అంటూ మొదలుపెట్టారు. కాంట్రవర్సీ లేదంటూనె పెద్ద కాంట్రవర్శీని క్రియేట్ చేస్తున్నాడని పాట చూసిన తరువాత క్లిస్టర్ క్లియర్ గా అర్ధమవుతుంది.

‘కత్తేల్లేవు ఇప్పుడు.. చిందే నెత్తురు లేదిప్పుడు.. యుద్ధం చేసే పద్ధతి మొత్తం మారిందిప్పుడు..’ ”కొత్త యుద్ధం ఇది కొత్త యుద్ధం..” అంటూ సాగే ఈ పాటలో విజువల్స్ మొత్తం ప్రస్తుత ఏపీ రాజకీయాలను చూపించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అన్న ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను..’తో ప్రారంభమయ్యే ఈ పాట శ్రోతల్లో ఆసక్తి పెంచేలా తీర్చిదిద్దారు వర్మ. అసెంబ్లీలో జరిగిన వాదనలను చూపిస్తూ కత్తులు లేవిపుడు.. చిందే నెత్తురు లేదిపుడు.. అంటూ పాటను పీక్ స్టేజీకి తీసుకెళ్లారు. రక్త చరిత్ర రెండు పార్టులు, లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇలా బయోపిక్‌లను ఎంచుకున్న వర్మ.. ప్రస్తుత పరిస్థితులే ప్రధాన పాత్రలుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ పాటతో స్పష్టమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -