బాత్రూమ్ లో శవమై కనిపించిన మోడల్

- Advertisement -

కేరళకు చెందిన మోడల్ షహానా అనుమానాస్పద స్థితి మృతి చెందడం దుమారం రేపుతోంది. పుట్టిన రోజు నాడే బాత్ రూమ్ లో విగత జీవిగా కనిపించడం కోలీవుడ్ పరిశ్రమలో విషాదం నింపింది. కోజికోడ్ కు చెందిన 21 ఏళ్ల షహానా పలు జ్యువలరీ యాడ్స్ లో నటించింది. అయితే ఆమెను భర్తే చంపేశాడని షహానా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఏడాదిన్నర క్రితం షహానా.. సజ్జద్ ను పెళ్లి చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు ఎక్కువ కావడంతో వారం రోజు క్రితం బయటకు వచ్చేసి భర్త సజ్జద్ తో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఇటీవలే ఓ తమిళ సినిమాలో నటించే అవకాశం షహానాకు వచ్చింది. ఇందుకు సంబంధించి రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. దీనిపై భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

పుట్టిన రోజు నాడు కూడా భర్త ఆలస్యంగా ఇంటికి రావడంతో గొడవ మరింత పెద్దదైందనీ అంటున్నారు. ఈ క్రమంలో బాత్ రూమ్ లో శవమై కనిపించింది. ఆమెది హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -