కొత్త సినిమాల అప్డేట్లు సరే.. ఆచార్య విడుదలలో క్లారిటీ ఏదీ..!

- Advertisement -

నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వరుసగా క్యూ కట్టాయి. నిన్నంతా సోషల్ మీడియాలో చిరంజీవి మేనియా కనిపించింది. మైత్రి మూవీస్ పతాకంపై చిరంజీవి 154వ సినిమాగా బాబీ దర్శకత్వంలో వస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న వేదాళం రీమేక్ టైటిల్ అనౌన్స్ చేశారు. ఆచార్య మూవీ మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. కానీ ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఆ సినిమా విడుదల ఎప్పుడు అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు.

ముందుగా ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని అంతా భావించారు. అంతలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ని అక్టోబర్ 13న దసరా సందర్భంగా విడుదల చేస్తుండడంతో ఆచార్య సినిమా విడుదల డేట్ మారింది. ఆచార్య మూవీని ఇంకా ముందుకు జరిపి సెప్టెంబర్ లోనే విడుదల చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆగస్టు నెల ముగుస్తున్నప్పటికీ ఇంకా ఆచార్య విడుదలలో స్పష్టత రాలేదు.

- Advertisement -

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్,గ్రాఫిక్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఆ మూవీ దసరాకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ వాయిదా పడితే దసరా సమయంలో ఆచార్యను విడుదల చేసేందుకే ఇంకా విడుదల డేట్ ప్రకటించలేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడుతుందా.. ఆచార్య దసరాకు వస్తుందా.. లేదా.. అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read: ఖిలాడి నుంచి ఫస్ట్ సింగిల్.. వచ్చేది ఎప్పుడో తెలుసా..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -