సూపర్ స్టార్ ట్వీట్.. స్టైలిష్​ స్టార్​ రిప్లే… తగేదే ల్యే..!

- Advertisement -

స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​.. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిన పుష్ప సినిమా డిసెంబర్ 17విడుదలై బాక్సాఫిస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. తాజాగా పుష్ప సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన రివ్యూ పోస్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. ట్వీట్ పుష్ప సినిమా పై ప్ర‌శంస‌లు కురిపిచారు.

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా అద్భుతంగా ఉందని, పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అని, ఇదో సంచ‌ల‌నం అని మ‌హేశ్ బాబు కొనియాడారు. ఈ సినిమాతో మ‌రోసారి ద‌ర్శ‌కుడు సుకుమార్ త‌న‌ను తాను నిరూపించుకున్నాడ‌ని అన్నారు. ఇక దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌సాద్ గురించి కొత్తగా చెప్ప‌డానికి ఏముంద‌ని, ఆయ‌నో రాక్ స్టార్ అని మ‌హేశ్ ప్రశంసించారు. ఇదో గొప్ప సినిమా అని, ఈ సినిమా బృందానికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

మ‌హేశ్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ స్పందిస్తూ ఆయ‌న‌కు థ్యాంక్స్ చెప్పాడు. ‘థ్యాంక్యూ వెరీ మ‌చ్ మ‌హేశ్ బాబు గారూ.. పుష్ప సినిమా బృందం అంద‌రి ప‌ని తీరును మీరు మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా హృద‌యాల‌ను గెలుచుకున్న అభినంద‌న’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

చిన్న సినిమాలు బతకాలి.. పెద్ద సినిమాలు ఆడాలి

పది గెటప్స్ లో మాస్ మహారాజ రవితేజ

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -