Wednesday, May 8, 2024
- Advertisement -

‘మల్లేశం’ సమీక్ష

- Advertisement -

టైటిల్‌ : మల్లేశం
జానర్‌ : బయోపిక్‌
నటీనటులు : అనన్య, ఝాన్సీ, చక్రపాణి తదితరులు
సంగీతం : మార్క్‌ కె.రాబిన్‌
దర్శకత్వం : రాజ్‌ ఆర్‌
నిర్మాత : రాజ్‌ ఆర్, శ్రీ అధికారి

ప్రియాదర్షి ప్రధాన పాత్ర లో మన ముందుకు వచ్చిన చిత్రం మల్లేశం. అతి తక్కువ మంది అనుభవం ఉన్న నటులు, అనేక మంది కొత్త వారితో శ్రీ అధికారి తో కలిసి రాజ్ ఆర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించినదే ఈ చిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై సురేష్ బాబు ఈ సినిమా ని సమర్పిస్తున్నారు. చింతకింది మల్లేశం జీవితం పైన ఈ సినిమా చేయబడింది. ఈ సినిమా సమీక్ష ని ఈ కింద చదవచ్చు.

కథ: మల్లేశం అనే ఈ సినిమా చింతకింది మల్లేశం అనే ఒక సాధారణ యువకుని, అతను చేసిన అసాధారణ పని వెనుక దాగున్న కష్టం గురించి చెప్పే కథ. తల్లి బాధను చూడలేక ఆసుయంత్రం కనిపెట్టడానికి ఆరాటపడ్డ ఒక చేనేత యువకుడు మల్లేశం (ప్రియాదర్షి)ఏం చేసాడు? తను అనుకున్నది ఎలా సాధించాడు? అనేది ఈ సినిమా కథ.

నటీ నటుల పని తీరు: మల్లేశంగా ప్రియదర్శి నటన కచ్చితంగా అందరినీ అబ్బురపరుస్తుంది అని చెప్పచ్చు. మొదటి నుండి చివర వరకు ప్రియదర్శి ఈ సినిమా ని తన భుజాల మీద మోసాడు. ఎంత బాగా నటించాడు అంటే ఈ సినిమా లో మనం పూర్తిగా ప్రియదర్శి ని మార్చిపోయి అతను పోషించిన మల్లేశం అనే పాత్ర తో ట్రావెల్ చేస్తాము. ప్రియదర్శితో పాటు హీరో తల్లి పాత్రలో ఝాన్సీ, హీరో భార్యగా అనన్య, హీరో తండ్రిగా ఆనంద చక్రపాణి ఒకరి తో ఒకరు పోటీ పడి మరీ నటించారు. హీరో మామగా ఏలె లక్ష్మణ్ కూడా బాగా నటించారు. మిగిలిన నటీ నటులు కూడా తమ పరిధి మేరకు నటించి అందరినీ మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ సినిమా లో కెమెరా పనితనం బాగుంది. పల్లె వాతావరణం, ఆ పరిసరాల్ని అందం గా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కూర్పు మంచిగా చేశారు. సినిమా లో టెక్నీకల్ టీమ్ అందరూ తమ శక్తీ మేరకు పని చేసారు. మార్క్ కె రాబిన్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన సినిమా కి ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా మంచిగా కుదిరింది. సినిమా లో దర్శకుడు చెపుదాం అనుకున్న కథ కి నేపథ్య సంగీతం బాగా సహాయ పడింది. గ్రాఫిక్స్ కూడా మంచిగా డిసైన్ చేశారు మేకర్స్. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఔట్పుట్ ని చిత్ర యానిట్ సాధించింది.

రివ్యూ: ఈ సినిమా కథ లో అనేక అంశాలు ఉన్నాయి. దర్శకుడు అన్నిటినీ టచ్ చేస్తూ అన్నిటినీ గొప్పగా చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా లో కష్టాలున్నాయి. కన్నీళ్ళున్నాయి. ఆనందాలున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని పంచే సందర్భాలున్నాయి. ఒక చేనేత కార్మికుడి ఆత్మహత్యతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత పిల్లలతో మంచి హాస్యాన్ని పండించి మధ్య మధ్యలో చేనేత కుటుంబాల బాధలను, వారు కోల్పోయిన ఆనందపు క్షణాలను చూపించే ప్రయత్నం చేసాడు. ఒక సాధారణమైన చేనేత కుటుంబాల జీవన చిత్రణ ఎలా ఉంటుంది, పల్లెటూళ్ళలోని సామాజిక సంబంధాలు ఎలా ఉంటాయి అనే అంశాలని కూడా దర్శకుడు అందం గా ఈ సినిమా లో ఆవిష్కరించారు. మొదటి సన్నివేశం నుండి చివరివరకూ గ్రిప్పింగ్ గా, ఎంటర్ టైనింగ్ గా వున్న ‘మల్లేశం’ మనల్ని ఎమోషన్ సన్నివేశాల్లో కట్టిపడేస్తుంది. బయోపిక్కుల కాలంలో తప్పకుండా ఒక మంచి బయోపిక్ చిత్రం గా ‘మల్లేశం’ నిలుస్తుంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -