పూజ హెగ్డేపై రోజా భర్త ఘాటు విమర్శలు..!

- Advertisement -

హాట్ బ్యూటీ కన్నడ భామ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్. బాలీవుడ్ లో కూడా పూజ హెగ్డే కు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర హీరోయిన్లు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పూజ హెగ్డే. పూజా హెగ్డే తెలుగులో తొలి సినిమా ముకుంద. ఈ సినిమాకంటే ముందే ఆమె తమిళ్ లో హిందీలో హీరోయిన్ గా నటించింది. అయితే అక్కడ ఆమెకు గుర్తింపు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ వైపు వచ్చింది. అయితే ఆమె హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి సుమారు పదేళ్లు అవుతోంది. అయితే ఆలస్యంగా అయినా ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది. భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నా.. అగ్ర హీరోలందరూ పూజ హెగ్డే ను ప్రిఫర్ చేస్తున్నారు. దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఇదిలా ఉంటే పూజ హెగ్డే వైసీపీ ఎమ్మెల్యే రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి విమర్శలు గుప్పించారు. స్టార్ డమ్ రాగానే పూజ ఎంతో మారిపోయిందని ఆయన అన్నారు. ఆమె వల్ల నిర్మాతకు ఆర్థిక భారం పెరుగుతోందని చెప్పారు. తొలి నాళ్లలో పూజ తన వెంట ఒక అసిఅసిస్టెంట్ ను తీసుకొచ్చేదని… షూటింగ్ సమయంలో డ్రెస్సింగ్, మేకప్, ఇతర అవసరాలను అతనే చూసుకునేవాడని సెల్వమణి తెలిపారు. ఇప్పుడు ఏకంగా 12 మంది అసిస్టెంట్లను వెంట పెట్టుకుని షూటింగులకు వస్తోందని… దీనివల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. ఇంతమంది అసిస్టెంట్ల అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

- Advertisement -

ప్రస్తుతం పూజ హెగ్డే టాలీవుడ్ లో ప్రభాస్ ‘రాధే శ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సినిమా ‘బీస్ట్’లో, బాలీవుడ్ లో సల్మాన్ ‘కబీ ఈద్ కబీ దివాలి’ మరియు రణ్ వీర్ ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -