Friday, April 26, 2024
- Advertisement -

వీపీఎఫ్‌, డీఎస్పీ గుత్తాధిప‌త్యంపై సినీ ప‌రిశ్ర‌మ‌ ఆగ్ర‌హం

- Advertisement -

వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) పేరుతో భారీగా వసూలు, డిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డీఎస్పీ) రెచ్చిపోతున్నారని.. వారు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నిర్మాతలు, పంపిణీదారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇన్నాళ్లు ఓపిక ప‌ట్టినా వాళ్లు త‌మ ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోవ‌డంతో మార్చి 2వ తేదీ నుంచి థియేట‌ర్లు బంద్ చేయాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

సినిమా థియేటర్లు అన్నీ మూసివేయాలని నిర్ణయించింది సినిమా ప‌రిశ్ర‌మ‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ కూడా థియేట‌ర్ల బంద్ పాటిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో భార‌త సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌మాదంలో ప‌డింది. దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిసి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గమ‌నార్హం. సింగిల్ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్సుల్లోనూ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉండ‌నుండాయి.

వర్చ్యువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) పేరుతో భారీగా వసూళ్లు చేయ‌డం.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డీఎస్పీ) రెచ్చిపోతున్నారని.. వారు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని నిర్మాతలు, పంపిణీదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త‌మ ప్రొడ‌క్ట్ తీసుకుని డిజిటల్‌గా వాడుకుంటూనే.. మాపైనే పెత్తనం చెలాయిస్తున్నారనేది నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ఫిల్మ్ చాంబర్స్ అన్నీ కలిపి బంద్ నిర్ణయం తీసుకున్నామ‌ని తెలుగు ఫిల్మ్ చాంబర్‌ అధ్యక్షుడు కిరణ్ ప్రకటించారు. క్యూబ్, యూఎఫ్ఓ ప్రతినిధులతో చర్చలు జరిపినా ఫలితం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం వర్చ్యువల్ ప్రింట్ ఫీజులో 25 శాతం తగ్గించాలనే డిమాండ్‌ను అంగీకరించలేదు. అయితే ఈ డిమాండ్‌పై కేవలం 9 శాతం తగ్గింపునకు ఆ సంస్థలు అంగీకరించడం సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. ఇక నుంచి క్యూబ్ – యూఎఫ్ఓకు త‌మ సినిమాలు ఇవ్వ‌మ‌ని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -