Friday, May 10, 2024
- Advertisement -

అర్జున్‌రెడ్డి యాంగర్ వర్సెస్ అల్లు అర్జున్ యాంగర్…. మిస్సయిన ఇంపాక్ట్ అదే

- Advertisement -

నా పేరు సూర్య…….నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ అదిరింది. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎక్కువ మందికి అనిపించిన ఫీలింగ్ ఇదే. కాకపోతే హార్ట్స్‌కి కనెక్ట్ అవ్వడంలో మాత్రం అర్జున్‌రెడ్డిలా సక్సెస్ అవ్వలేకపోయింది. యాంగర్ మేనేజ్‌మెంట్ చేతకాని కోపిష్టి క్యారెక్టర్‌లో అర్జున్‌రెడ్డిలో విజయ్ దేవరకొండ కనిపించినట్టుగానే నా పేరు సూర్యలో కూడా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అయితే అర్జున్ రెడ్డీ టీజర్‌తో క్రియేట్ అయిన స్థాయి ఇంపాక్ట్ మాత్రం ఈ నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.

అర్జున్‌రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్, సెన్సేషనల్ హిట్‌కి ప్రధాన కారణం అర్జున్‌రెడ్డిలోకి విజయ్ దేవరకొండ పరకాయ ప్రవేశం చేయడం. సినిమాలో ఎక్కడా కూడా విజయ్ దేవరకొండ కనిపించడు. ప్రతి ఫ్రేం, ప్రతి షాట్, ప్రతిసీన్‌లో అర్జున్‌రెడ్డి మాత్రమే కనిపిస్తాడు. నా పేరు సూర్య….నా ఇల్లు ఇండియాలో మిస్సయింది ఇదే. అల్లు అర్జున్ కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొదటి సినిమానే అయినప్పటికీ వక్కంతం వంశీ బాగానే హ్యాండిల్ చేశాడు. టెక్నికల్‌గా కూడా సినిమా ఉన్నతంగా ఉంది. అయితే ఫస్ట్ ఇంపాక్ట్‌లో కేవలం సూర్య క్యారెక్టర్ మాత్రమే కనిపించలేదు. చాలా సార్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కనిపించాడు. ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ డ్రివెన్ కథలు సెలక్ట్ చేసుకున్నప్పుడు స్క్రీన్ పై క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి. ఫస్ట్ ఇంపాక్ట్‌లో……..హూ ఆర్ యూ అన్న వాయిస్ వచ్చాక సినిమాలోని సూర్య క్యారెక్టర్ గురించి చెప్పి ఉంటే బాగుండేది……అలా కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…….అని స్క్రీన్‌పై అక్షరాలు పడడం అంటే సూర్యగా అల్లు అర్జున్ చేస్తున్నాడు……స్టైలిష్ స్టార్‌ని చూసి ఎక్సైట్ అవ్వండి అని చెప్పినట్టుగా ఉంది. ఇక అల్లు అర్జున్ మేకోవర్ బాగానే ఉంది కానీ స్టైల్‌గా కనిపంచాలన్న తాపత్రయం మాత్రం చాలానే కనిపిస్తోంది. బిల్డప్ షాట్స్, స్టైలిష్‌గా కనిపించాలన్న తాపత్రయాలు అన్నీ వదిలేస్తే అప్పుడు ఒక అర్జున్‌రెడ్డి, సుల్తాన్, దంగల్ స్థాయి పెర్ఫార్మెన్స్‌లు సాధ్యమవుతాయి. ఫస్ట్ ఇంపాక్ట్‌లోనే స్టార్ ఢం మిస్సవ్వకుండా బిల్డప్ షాట్స్, స్టైలిష్‌గా చూపించాలన్న ప్రయత్నం ఈ స్థాయిలో కనిపిస్తే అల్లు అర్జున్ ఇరగదీశాడ్రా అన్న పేరు వస్తుందేమో కానీ సూర్య మాత్రం ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్ళడు.

ఆ లోపాలు పక్కనపెడితే అల్లు అర్జున్‌ని మాత్రం కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. నాలుగు కామెడీ సీన్స్, నాలుగు పాటలు, కోటీశ్వరుల కొంపలు…..అనే రొటీన్ స్టఫ్ నుంచి కాస్త బెటర్మెంట్ కోసం ట్రై చేశాడు అర్జున్. తన మేకోవర్ విషయంలో కూడా అల్లు అర్జున్‌ని మెచ్చుకోవాలి. రేపు సినిమాలో అయినా బిల్డప్ షాట్స్, స్టార్ మెటీరియల్‌ని తగ్గించుకుని సూర్య మాత్రమే స్క్రీన్‌పై కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడంటే మాత్రం పెర్ఫార్మర్‌గా బన్నీ పేరు టాప్ లిస్టులో చేరిపోవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -