రెండోసారి మహేశ్, నదియా కాంబో..

- Advertisement -

కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఇవాళ (మే 12న) ప్రేక్షకుల ముందుకొచ్చింది మహేశ్ బాబు సర్కారీ వారి పాట. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్.

అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్.. అంశం తెరపైకి వచ్చింది. సర్కారు వారి పాటలో సీనియర్ నటి నదియా కీలక పాత్ర పోషించారు. అయితే నదియాతో మహేశ్ బాబుకు ఇది రెండో సినిమా. దాదాపు 34 ఏళ్ల తర్వాత వారు కలిసి నటించడం విశేషం. 1988లో వచ్చిన సూపర్ హిట్ మూవీ..బజార్ రౌడీ చిత్రంలో నదియా హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

ఆ సినిమాలో మహేశ్ అన్నయ్య రమేశ్ బాబు హీరో. ఇదే చిత్రంలో మహేశ్ కీలక పాత్ర పోషించారు. ఇంకో విచిత్రం ఏంటంటే బజారు రౌడీ, సర్కారు వారి పాట రెండు చిత్రాల్లోనూ మహేశ్ బాబు పేరు మహేశ్ కావడం విశేషం.

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

చిరంజీవితో రాధిక మూవీ

కొత్త వాదన తెరపైకి తెచ్చిన హీరో సిద్ధార్థ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -