అద‌ర‌గొడుతూ.. దూసుకుపోతున్న అందాల నిధి

- Advertisement -

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా న‌టించిన “స‌వ్య‌సాచి” సినిమాతో తెలుగు వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక నిధి అగర్వాల్‌. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఉండే అమ్మ‌డు త‌న అందాల నిధితో యువ‌తలో య‌మ క్రేజ్ సంపాదించుకుంది. స‌వ్య‌సాచి సినిమా త‌రువాత “మిస్ట‌ర్ మ‌జ్ను” సినిమాతో త‌న అందాల‌ను ఆరబోసి హాట్ టాపిక్ గా నిలిచింది. కానీ ఆ రెండు సినిమాలు పెద్ద‌గా హిట్ సాధించ‌లేదు.

అందం అభిన‌యంతో ఆ రెండు సినిమాల్లో నిధి అద‌ర‌గొట్టిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డికి అదృష్టం తోడై రాలేద‌ని అనుకున్నారు. కానీ ఇటీవ‌ల వ‌చ్చిన “ఇస్మార్ట్ శంక‌ర్ ” సినిమా బ్లక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డంతో పాటు అందాల ఆర‌బోత‌తో నిధికి మ‌స్తు పాపులారిటీ ల‌భించింది. దీంతో ఈ అమ్మ‌డికి మ‌రి‌న్ని ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌చ్చాయి.

- Advertisement -

ఏకంగా ప‌వ‌న్ సినిమాలోనే క‌థానాయిక‌గా ఛాన్స్ కొట్టేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్-క్రిష్ కాంభోలో “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” అనే సినిమా రాబోతుంది. ఇందులో నిధి హీరోయిన్. ఇదిలా ఉంటే తాజాగా ద‌గ్గుపాటి రానా స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ను కూడా ఈ అమ్మ‌డు కొట్టేసింద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. భారీ బ‌డ్జెట్ తో ఓ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఈ సినిమాను తీయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌నీ.. త్వ‌ర‌లోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొంద‌డం ఖాయ‌మ‌ని సినీవ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఏంటీ ఈ కోతలు.. కేంద్రంపై ఎర్ర‌బెల్లి ఫైర్ !

ఏప్రిల్‏లో సినీ ప్రియులకు పండగే.. !

కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్ రాబోతోంది !

మీ దంతాలు పసుపురంగులో ఉంటే.. ఈ చిట్కాలు మీ కోసం !

‘వీరయ్య’గా.. చిరు విశ్వరూపం !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -