Sunday, April 28, 2024
- Advertisement -

రాజకీయ కోణాన్ని చూపించిన తారక్…

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒంటరి వాడు కాదు.. అవసరమైతే ఎలాంటి శక్తులతోనైనా కలవగలడు అనిపించుకునే విధంగా ..తన కొత్త చిత్రానికి పవన్ ను ఆహ్వానించి టీడీపి శ్రేణుల్లో కలకలం సృష్టించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కాబట్టి.. పవన్ వచ్చాడని చెప్పడానికి వీల్లేదిక్కడ. ఇక్కడ దృశ్యం మరోలా ఉంది. లోకేష్ అండ్ కో తనను ఏకాకిని చేయాలని చూస్తున్నాయని తారక్ ఎప్పుడో గ్రహించాడు.

అందుకే తన మామ ఆర్ధిక బలాన్ని పక్కన పెట్టి ఈమధ్య కొన్ని పెద్ద పెద్ద పనులే చేయిస్తున్నాడని గత కొన్ని రోజులుగా ఏపి అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలో చిరంజీవిని కూడా ఏదో ఒక రకంగా తన కొత్త చిత్రానికి ఆహ్వానించి… ఏదో ఒక టీజర్ లాంచ్ చేయడమో లేక మరేదో చేయడమే చూస్తున్నాడని తారక్ ను దగ్గరనుంచి చూస్తున్నవారు చెబుతున్నారు.

యంగ్ టైగర్ మూమెంట్స్ ను నిశితంగా పరిశీలిస్తోన్న లోకేష్ …అదను కోసం చూస్తున్నాడని తెలుస్తుంది. కాని తారక్ స్పీడ్ ను తట్టుకునే శక్తి సినిమా పరంగా లేకపోయినా…రాజకీయ పరంగా కొంత వరకు లోకేష్ కంట్రోల్ లోనే ఉంది. బట్ ఇక్కట మనం గమనించాల్సింది ఒకటుంది. అదే… తారక్ రాజకీయ కోణం. చాలా ఏళ్ల తర్వాత చూపిస్తాడనుకుంటోన్న రాజకీయ నాయకుడి పాత్రను ఇప్పటినుంచే .జనాలకు అలవాటు చేసే ప్రయత్నం అయితే బుడ్డోడు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -