టివి నటుడు రాజేష్ దత్త పై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య!

తెలుగు బుల్లితెర నటుడు రాజేష్ దత్త వివాదంలో ఇరుక్కున్నారు. అతడు ఇతర అమ్మాయిలతో ఇల్లీగల్ అఫైర్స్‌ పెట్టుకున్నాడని ఆరోపిస్తూ అతని భార్య సాధన, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మొగలిరేకులు, చక్రవాకం, రాధాకల్యాణం, తూర్పు వెళ్లే రైలు, వదినమ్మ తదితర 28 సీరియల్స్ లో నటించిన రాజేష్ దత్తా తనకు అన్యాయం చేశాడు అంటూ భార్య సాధన అలియాస్ అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజేష్‌ కు తనకు 2015, జూన్‌ 6న వివాహం జరిగిందని.. పెళ్ళైన తర్వాత 3 నెలలు గాజులరామారంలోని తన భర్త రాజేష్ ఇంట్లోనే సంసారం సాగిందని ఆమె చెప్పింది. చెన్నైలో కాపురం పెట్టిన రాజేష్, తరచూ షూటింగ్స్ పేరిట భార్యను వదిలేసి హైదరాబాద్ కు వచ్చేవాడు. ఇతర అమ్మాయిలతో తనకు వివాహం కాలేదని చెబుతూ, సంబంధాలు నడిపేవాడు.

ఇదేంటని ప్రశ్నిస్తే.. తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని అన్నారు. అంతే కాదు.. తనను ఇంట్లో నుండి గెంటివేశాడని రాజేష్‌ భార్య సాధన ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాధన ఆమె తల్లిదండ్రులు కలిసి జగద్గీరి గుట్ట పోలీసులను ఆశ్రయించి రాజేష్‌ పై ఫిర్యాదు చేశారు. వారు రాజేష్ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తనకు న్యాయం చేయాలని సాధన డిమాండ్‌ చేస్తోంది.

దీదీ విజయం.. రాంగోపాల్ ఫన్నీ వీడియో.. వైరల్

2021 ఎన్నికల్లో సినీ నటులకు ఘోర పరాభవం!

నేటి పంచాంగం,సోమవారం (3-05-2021)

Related Articles

Most Populer

Recent Posts