Friday, April 19, 2024
- Advertisement -

2021 ఎన్నికల్లో సినీ నటులకు ఘోర పరాభవం!

- Advertisement -

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాయకుల భవిత్యం ఏంటో తేలిపోయింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఇక తమిళనాట డీఎంకే జెండా ఎగిరింది.

తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకే విజయానికి బాటలు వేసిన స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో సినీతారలు ఢీలా పడిపోయారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సినీ నటులకు చేదు అనుభవం మిగిలింది. మక్కల్ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల హాసన్ తన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసన్ (బీజేపీ) చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేశ్ గోపీ ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని థౌజండ్ లైట్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ప్రముఖ నటి ఖుష్బూ డీఎంకే నేత ఎళిలన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే డీఎంకే చీఫ్ స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2021 ఎన్నికల్లో సినీ నటులకు ఘోర పరాభవం!

నేటి పంచాంగం,సోమవారం (3-05-2021)

కేరళలో 40 ఏళ్ల రికార్డు బద్దలు.. తిరుగులేని నేతగా విజ‌య‌న్‌..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -