దుమారం రేపుతున్న నటి వ్యాఖ్యలు

- Advertisement -

నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో ఆమెపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సుల్తాన్ బజార్‌ పోలీసులకు భజరంగ్‌ దళ్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి కాశ్మీర్ ఫైల్స్‌తో పాటు గో రక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్‌ పండిట్లను ఉగ్రవాదులు చంపడం.. గో రక్షకులు ఓ ముస్లిం వ్యక్తిని చంపడం ఒకటే అన్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి.

దీనిపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అటు గో రక్షకులు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హీరోయిన్ సాయి పల్లవి పై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లోనూ కేసు నమోదైంది. సాయి పల్లవిపై అఖిలభారత గో సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ ఫిర్యాదు చేశారు.

- Advertisement -

సాయి పల్లవి వెంటనే బహిరంగంగా గో రక్షకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ లను కోరారు.సాయి పల్లవి వ్యాఖ్యల వీడియోను పరిశీలించి లీగల్ ఒపీనియన్ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

షూటింగ్‌లో గాయపడిన రవితేజ

యశ్‌తో పూజా హెగ్డే మూవీ

మహేశ్ బాబు మూవీలో రష్మిక.. పూజాను తప్పించారా.. ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -