Monday, May 6, 2024
- Advertisement -

పోలీసోడు రివ్యూ

- Advertisement -

తెలుగు లో మంచి మార్కెట్ కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు తమిళ హీరో విజయ్. తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్ లతో పాటు సెంటిమెంట్ పాళ్ళు కూడా ఎక్కువగా పెట్టే అలవాటు ఉన్న హీరో విజయ్ ప్రస్తుతం తమిళ నాడు లో రజినీకాంత్ తరవాత అంత ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో. మనోడు తెలుగు లో తుపాకి తరవాత మంచి మార్కెట్ ని తెచ్చుకున్నా ఆ తరవాత వరసగా అతని సినిమాలు లేకపోవడం తో ఫెయిల్ అయ్యాడు.

కత్తి సినిమాని డైరెక్ట్ గా తెలుగు లో రిలీజ్ చెయ్యాలని కోరుకున్న విజయ్ ఆశలకి టాగూర్ మధూ అప్పట్లో అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. టాగూర్ మధూ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చెయ్యాలి అనుకున్నా పవన్ దానికి ఓకే చెప్పకపోగా ఇలోగా కత్తి సినిమా పాతది అయిపొయింది. ఇప్పుడు చిరంజీవి ఆ సినిమాని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తరవాత పులి సినిమా దెబ్బకి విజయ్ మార్కెట్ తెలుగులో కుదేలు అయ్యింది . ఇప్పుడు పోలీస్ ( పోలీసోడు పేరు మార్చారు) సినిమా తో తెలుగు లో మార్కెట్ తెచ్చుకోవాలి అని రాజారాణీ ఫేం డైరెక్టర్ అట్లీ తో కలిసి ఒచ్చిన విజయ్ కి ఏ రకమైన రిజల్ట్ ఒచ్చింది అనేది చూద్దాం. 

 

కథ  – పాజిటివ్:

జోసెఫ్  ( విజయ్ ) తన కూతురు నైనిక తో ఒంటరి జీవితం గడుపుతూ ఉంటాడు. కేరళ లో ఒక ప్రాంతం లో బతుకుతున్న ఇతను ఒక బేకరీ నడుపుతూ ఉంటాడు . తన కూతురు టీచర్ యామీ జాక్సన్ తో రోమాన్స్ కూడా చేస్తూ ఉంటాడు మనోడు. కొందరు లోకల్ గూండాలతో అతనికి అయిన గొడవ సమయం లో అతను తన గతాన్ని వివరిస్తాడు. చెన్నయి లో ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ గా రాధిక కొడుకు గా ఉంటాడు. అదే సమయం లో సమంత తో అతని ప్రేమ వివాహం జరుగుతుంది. వారిద్దరినీ అతని కళ్ళ ముందరే దారుణంగా చంపేస్తారు. మహేంద్రన్ అనే విలన్ ద్వారా ఇదంతా జరుగుతుంది. ఒక రేప్ కేస్ కారణంగా ఈ తతంతం జరగగా తన కీ తన భార్యకీ ముద్దుల బిడ్డగా ఉన్న నైనిక ని తీసుకుని జోసెఫ్ కేరళా వెళ్ళిపోతాడు. కానీ విలన్ గ్యాంగ్ అతనిని వెతుక్కుంటూ ఒచ్చి చంపడానికి ప్రయత్నించగా ఏం జరిగింది అనేది అసలు కథ . విజయ్ ఈ సినిమాని తన బుజం మీద నడిపించాడు అని చెప్పాలి. మూడు పాత్రల్లో చాలా డిఫరెంట్ గా కనిపించిన విజయ్ పర్ఫెక్ట్ గా చేసాడు. విజయ్ తరవాత నైనిక ఈ సినిమా కి అతి పెద్ద అట్రాక్షన్. క్యూట్ లూక్స్ తో క్యూట్ స్మైల్ తో ఇద్దరి మధ్యనా కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఫస్ట్ హాల్ఫ్ ఈ సినిమా కి చక్కగా సింక్ అయ్యింది. ఇంటర్వెల్ బ్లాక్ లో విజయ్ చూపించిన వేరియేషన్ – కూతురు కోసం తండ్రి పడే తపన ని డిస్ప్లే చెయ్యడం ఇవన్నీ బాగా కుదిరాయి. ఇంటర్వెల్ బ్లాక్ దానివలన అదరహో అనిపించింది . ఫైట్ లూ యాక్షన్ సన్నివేశాలూ కూడా మంచి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. డైరెక్టర్ తేరీ విజయ్ ని సరికొత్తగా చూపించడం లో సక్సెస్ అయ్యాడు ..

 

నెగెటివ్ లు:

ఫస్ట్ హాఫ్ తో డైరెక్టర్ ఏర్పరుచుకున్న ప్లాట్ ని సెకండ్ హాఫ్ లో పూర్తిగా కోల్పోయాడు అట్లీ . సెకండ్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాలతో పాటు చాలా సాధారణ సీన్ లు పెట్టేసాడు . తదుపరి సీన్ ఏమి ఒస్తుంది అనేది సాధారణ సినిమా ప్రేక్షకుడు అత్యంత తేలికగా చెప్పేసే విధంగా ఉంది ఆ స్క్రీన్ ప్లే అది సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పచ్చు. థియేటర్ లలో ఫస్ట్ హాఫ్ కి క్లాప్స్ పడగా సెకండ్ హాఫ్ లో నీరు గారి పోయారు జనాలు. డైరెక్టర్ అట్లీ సెంటిమెంట్ సీన్ లతో మాటు రెండు మూడు యాక్షన్ సీన్ లు పెర్ఫెక్ట్ సెట్ అయ్యేలా పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది . 

 

మొత్తంగా .. బేబి నైనిక – విజయ్ ల యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కి స్క్రీన్ ప్లే అతిపెద్ద మైనస్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ కాస్త ఓర్పుతో కూర్చోవాల్సిన పరిస్థితి. అయినా ఫామిలీ ఆడియన్స్ కి బాగా ఎక్కే చాన్స్ కనిపిస్తోంది. సెంటిమెంట్ సీన్ లు ఇంకాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే డైరెక్టర్ సినిమాని మరొక లెవెల్ కి తీసుకుని వెళ్ళేవాడు. కొన్ని సీన్ లలో అట్లీ మార్క్ కనిపించగా సినిమా ఆసాంతం అది కంటిన్యూ అవ్వలేదు. ఎడిటింగ్ బాగా ఒచ్చింది. ఏదేమైనా ఫామిలీ తో ఈ వీక్ ఎండ్ ఒక్క సారి చూడదగ్గ సినిమా పోలీస్. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -