Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా చికిత్స పై ..ఈటల రాజేందర్‌ కీలక నిర్ణయం..!

- Advertisement -

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్ని ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌… ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలతో భేటీ అయ్యారు.కొవిడ్ చికిత్సలు, పడకల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై మంత్రి చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో రెండు రోజులుగా కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి లక్షకు పైగా చేస్తున్నారు. పరీక్షల సంఖ్యతో పాటు.. రాష్ట్రంలో మహమ్మారి సోకిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

గడచిన 24 గంటల్లో లక్షా 11 వేల 726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… అందులో 2909 మందికి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది. ఒకే రోజులో ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావటం సుమారు ఆరు నెలల కాలంలో ఇదే మొదటి సారి కావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మరో 4533మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

నాయిని ఇంట్లో సోదాలు..10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..!

తగ్గేదే లే.. అదే రక్తం, అదే వారసత్వం, అదే చిరునవ్వు..!

ప‌వ‌న్ లో జోష్ చూస్తుంటే మహాఆనందంగా ఉంది : చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -