పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్…

కేజీఎఫ్​ దర్శకుడు ప్రశాంత్​నీల్​ .. ప్రభాస్​తో భారీ బడ్జెట్​తో సలార్​ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సలార్​ లో శృతి హాసన్​ హీరోయిన్​గా చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మరో వైపున ప్రభాస్ ఓం రౌత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీలో ప్రభాస్​ రాముడిగా నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపద్యంలో.. ప్రాజెక్ట్ కే ( వర్కింగ్ టైటిల్) సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ 25వ సినిమా సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే టైటిల్ ను సెట్ చేశారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం సలార్​ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడట. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ ఇదే మొదటిసారి. చాలాకాలంగా ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులు కోరిక నెరవేరే పోతుంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.

పూజ హెగ్డే ‘రాధే శ్యామ్’ పోస్టర్..!

సమంతతో ఎఫైర్ పై స్పందించిన ప్రీతం..

Related Articles

Most Populer

Recent Posts