ది ఫ్యామిలీ మెన్-2 తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే..!

- Advertisement -

తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే తెర కెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. మామూలుగా వెబ్ సీరిస్ మనదేశంలో కరోనా ఎంటరై థియేటర్లు మూత పడిన తర్వాతే ప్రాచుర్యం పొందాయి. థియేటర్లు మూతపడడంతో వేరే ఆప్షన్ లేక ప్రేక్షకులు వెబ్ సీరిస్ లు చూడడం ప్రారంభించారు. అయితే కరోనా మన దేశం లోకి ఎంటర్ కాకముందే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గ్రాండ్ హిట్టయింది.

ఒక వెబ్ సిరీస్ కు మన దేశంలో ఇంతలా ఆదరణ దక్కుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ వెబ్ సీరిస్ హిందీ తో పాటు సౌత్ లోని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయి అందరినీ అలరించింది. ది ఫ్యామిలీ మెన్ లో బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి,షరీబ్ హస్మి ప్రముఖ పాత్రల్లో నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ దక్కడంతో అదే కాంబినేషన్ తో ది ఫ్యామిలీ మెన్-2 ని రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. ఇందులో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే సౌత్ పాపులర్ హీరోయిన్ సమంత టెర్రరిస్టుగా నటించడం. ఈ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుండడంతో తెలుగులో కూడా మొదటి నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ వెబ్ సిరీస్ మేకర్స్ ది ఫ్యామిలీ మెన్-2 ను కేవలం హిందీ భాషల్లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. దీంతో ఈ వెబ్ సిరీస్ ని చూద్దామని భావించిన తెలుగు ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. కొంత గ్యాప్ తర్వాత అయినా తెలుగులో స్ట్రీమింగ్ చేస్తారని భావించినా అలాంటి ప్రయత్నాలు చాలా రోజుల పాటు జరగలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం చాలా గ్యాప్ తర్వాత ది ఫ్యామిలీ మెన్-2 ను తెలుగులోకి డబ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనేది ఇప్పటివరకు మేకర్స్ ప్రకటించకపోయినా.. ఈ నెలాఖరులోగా ది ఫ్యామిలీ మెన్-2 తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Also Read

ఎన్టీఆర్ సినిమాకి యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్..!

చైతూ ‘లవ్ స్టోరీ’ తో వచ్చేస్తున్నాడు.. విడుదల ఎప్పుడంటే..!

దాక్కో దాక్కో మేక.. పులి వచ్చేసింది..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -