ర‌కుల్ సినిమా షూటింగ్ స్పాట్ పై రాళ్ల దాడి!

- Advertisement -

తెలుగులోనే కాకుండా అటు హిందీ, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ తెగ బిజీ బిజీగా ఉండే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్ప‌డు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తో క‌లిసి ‘ఎటాక్’ అనే మూవీ లో న‌టిస్తోంది.ఈ సినిమాకు లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈమ‌ధ్యే ఉత్తరప్రదేశ్‌లోని ధానిపూర్‌లో షురూ అయ్యింది.

ఆ షూటింగ్ లో భాగంగా ధనిపూర్‌లో యాక్షన్ సీన్ల‌ను తీస్తున్నారు. అయితే షూటింగ్ ద‌గ్గ‌ర స్థానికులు రాళ్ళు విస‌ర‌డంతో అక్క‌డ కొంత ఉద్రిక్త నెలకొంది. దీనికి కార‌ణం లేక‌పోలేద‌ట‌. సినిమా షూటింగ్ జ‌రుగుతుంద‌ని అక్క‌డ‌కు ఎంతో మంది స్థానికులు వ‌చ్చార‌ట‌. కానీ షూటింగ్ స్పాట్ వద్ద గేట్ మూసివేసి ఉంచార‌ట‌.

- Advertisement -

దాంతో వాళ్లు సెట్ గోడ ఎక్కి షూటింగ్ చూడటానికి ఎంతో ప్ర‌య‌త్నం చేశార‌ట‌. ఈ స‌మ‌యంలో సెక్యూరిటీకి స్థానికుల‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో కోపానికి లోనైన స్థానికులు షూటింగ్ స్పాట్ పై రాళ్ళు విసిరారు. చివ‌ర‌కు పోలీసుల రాక‌తో ఇరు వర్గాలు చెదిరి పోయాయి. దాంతో ప‌రిస్థితి శాంత ప‌డింద‌ట‌. ఈ గొడ‌వ‌లో ఎవ‌రికీ ఏ గాయాలు కాలేద‌ట‌.

15యేళ్ల త‌ర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ‌!

ట్రాన్స్ జెండ‌ర్ గా విజ‌య్ సేతుప‌తి !

ప్రేమలో ప‌డ్డ సాయి ప‌ల్లవి !

ఉప్పెన’ గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏమ‌న్నాడో తెలుసా?

రోజాతో ఆ కోరిక మిగిలిందంటున్న అల్ల‌రి న‌రేష్ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -