Thursday, May 9, 2024
- Advertisement -

ఆస్కార్ అవార్డ్……. పవన్‌ అబద్ధాలకు మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిందే

- Advertisement -

నిప్పులా బ్రతికా….. నిజాయితీగా ఉన్నా అని చెప్పి చంద్రబాబు చెప్పినన్ని సార్లు దేశంలో ఏ నాయకుడు కూడా చెప్పి ఉండడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో నిజాయితీ గురించి పవన్ చెప్పినన్నిసార్లు వేరే ఏ హీరో కూడా చెప్పి ఉండడు. పవన్, చంద్రబాబుల చుట్టూ ఉండే మనుషులను చూస్తేనే బోలెడన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ నిజాయితీ నిజాయితీ అంటూ అభిమానులను, నమ్మినవాళ్ళను మభ్యపెట్టడంలో పవన్, చంద్రబాబులిద్దరూ సక్సెస్ అవుతూనే ఉన్నారు.

ఇక తాజాగా రంగస్థలంలో సక్సెస్ మీట్‌లో వరుసగా అబద్ధాల వర్షం కురిపించాడు పవన్. ఏకంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలన్నీ కలిసి రంగస్థలంకి ఆస్కార్ అవార్డ్ వచ్చేలా లాబీయింగ్ చేయాలన్నాడు. ఇక హాలీవుడ్ బెస్ట్ సినిమాలకంటే రంగస్థలం గొప్ప సినిమా అన్నాడు. బాహుబలితో పోల్చేశాడు. ఇక రామ్ చరణ్‌ని అయితే సౌత్ ఇండియా……..నార్త్ ఇండియా……మొత్తం ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ అనే స్థాయిలో పొగిడేశాడు పవన్. ఇప్పటికిప్పుడు తెలుగువాళ్ళందరూ కలిసి రంగస్థలం సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి అనే ఇన్‌స్పిరేషన్ ఏదో వచ్చేసేలా సినిమాల కంటే ఎక్కువ యాక్టింగ్‌ని స్టేజ్‌పైనే చేసేశాడు పవన్ కళ్యాణ్. రంగస్థలం సినిమాకు కలెక్షన్స్ బీభత్సంగా పెరిగేలా….రంగస్థలం సినిమా ఒక అద్భుతం అని భ్రమపడేలా చేయడంలో తన అబద్ధపు ప్రసంగంతో భలే సక్సెస్ అయ్యాడు పవన్.

రంగస్థలం సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడదాం. ప్రత్యేక హోదా గురించి మాట్లాడమంటే రామ్ చరణ్‌కి జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు రావాలని చిరంజీవి అంటాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ప్రజా సమస్యలపై పవన్ ఈ స్థాయిలో ఎందుకు ప్రసంగించలేడు……ఈ ఆవేశం హోదా పోరాటం విషయంలో ఎందుకు రావడం లేదు అని ప్రజలందరూ చర్చించుకునే స్థాయిలో రంగస్థలం గురించి, రామ్ చరణ్ గురించి పొగిడేశాడు. కేవలం ఒక సినిమా కోసం పవన్ ఎన్నో అబద్ధాలు, తెచ్చిపెట్టుకున్న భావావేశం, అబద్ధపు హావభావాలతో రెచ్చిపోవడం మాత్రం పవన్ నిజాయితీపైనే ప్రజలకు మరోసారి సందేహం వచ్చేలా చేసిందనడంలో డౌటే లేదు అన్న విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయంటే పవన్ ప్రసంగం ఏ స్థాయిలో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -