బాలీవుడ్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. గత కొన్ని రోజులుగా వర్మ ..హిందీ సినిమా పరిశ్రమపై ఏదో రకంగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్-2 విడుదలైన తర్వాత..ఆర్జీవీ మరింత జోరు పెంచారు. జాతీయ భాష అంశంపై ఇటీవల సుదీఫ్- అజయ్ దేవ్‌గణ్‌ల మధ్య ట్విటర్‌లో యుద్ధమే జరిగింది.

ఆ వివాదం ముగిసిందో లేదో.. ఇటీవల మహేశ్‌ బాబు బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ సైతం దుమారం రేపాయి. తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ.. బాలీవుడ్‌ను టార్గెట్ చేసి మళ్లీ వివాదాల తుట్టె కదిపారు. సౌత్ మూవీస్ విజయాలతో బాలీవుడ్ వారికి పీడకలలు తప్పవనీ.. ఇకపై రీమేక్స్ కాకుండా మంచి కంటెంట్‌ను నమ్ముకోవాలంటూ రీసెంట్‌గా కామెంట్ చేసిన వర్మ తాజాగా …బాలీవుడ్‌ పని అయిపోయిందనే అర్థం వచ్చేలే వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

దక్షిణాది సినిమాల విజయాలు సాధించడం.. ఉత్తరాది సినిమాలు డీలా పడటం చూస్తుంటే.. బాలీవుడ్ రాబోయే రోజుల్లో కేవలం ఓటీటీ కోసమే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని కామెంట్ చేశారు. వర్మ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్‌లో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

రెండోసారి మహేశ్, నదియా కాంబో..

తాజ్ మహల్ స్థలం మాదే

ఓటీటీలో ఆర్ఆర్ఆర్ విడుదలంటే..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -