పంది మాంసం తినడం మా సాంప్రదాయం : నటి రష్మిక మందన

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఛలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి రష్మిక మందన తర్వాత గీతాగోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడు వరుస విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో నటిస్తుంది. ఈ ఏడాది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి మంచి విజయం అందుకుంది. తాజాగా ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న `యువర్ లైఫ్` వెబ్ పోర్టల్‌కు నటి  రష్మికా మందన్న ఇటీవల గెస్ట్ ఎడిటర్‌గా హాజరైన సంగతి తెలిసిందే.

రీఛార్జ్ యువర్ లైఫ్ విత్ రష్మిక పేరుతో రూపొందిన ఈ కార్యక్రమంలో రష్మిక పలు ఆరోగ్య సూత్రాలను చెప్పింది. చికెన్ పుట్టు కర్రీ ఎలా వండాలో చూపించింది. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక అనగానే.. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని అడిగారు. అవును, పంది మాంసం మా సంప్రదాయ వంటకం. పందిని అలానే నిప్పులపై కాల్చి తింటాం.

- Advertisement -

మేం సొంతంగా వైన్ తయారు చేసుకొని తాగుతామని.. రాత్రిపూట అలా తాగి పడుకుంటూ బాగా నిద్ర పడుతుందని దాని వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గుండెకు కూడా చాలా మంచిది అన్నారు. ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్‌ల వైన్ తాగుతారు. మొత్తానికి రష్మిక తన సాంప్రదాయలను ఎంతో స్పష్టంగా అభిమానులకు తెలియజేసింది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...